ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఫాదర్స్ డే సందర్భంగా “టాంటెక్స్ తో మీ అనుబంధం మరియు జీవిత అనుభవాలు” అంశం మీద సంస్థ మొదటి నుండి పని చేసిన అధ్యక్షులందరితో అత్మీయంగా ముచ్చటిస్తూ రెండు గంటలసేపు సరదాగా జరిగింది.
కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని జూమ్ లో జరుపుకున్నారు. ముందుగా ప్రస్తుత అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆన్లైనులో విచ్చేసిన పూర్వఅధ్యక్షులకు స్వాగతం పలికారు. ఫాదర్స్ డే సందర్భంగా వారి నాన్నని తలుచుకుంటూ తన అనుభవాలను, జ్ఞాపకాలను సభతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీనివాసులు బసాబత్తినని సాదరంగా ఆహ్వానించారు.
శ్రీనివాసులు కార్యక్రామానికి విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు తెలుపుకుంటూ సభకు విచ్చేసిన పూర్వాధ్యక్షులు ఆనంద మూర్తి కూచిభొట్లని, జనార్ధన రావుని, రాం ఎలమంచిలిని, సుభాష్ చలసానిని, మూర్తి ములుకుంట్లని, రాజా రెడ్డిని, డా.శ్రీధర్ రెడ్డి కొర్సపాటిని, చంద్ర శేఖర్ కన్నెగంటిని, సురేష్ మండువని, డా. నరసింహారెడ్డి ఉరిమిండిని, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డని సాదరంగా ఆహ్వానించారు.
అందరినీ వారు సంస్థకు పని చేసిన సంవత్సరం తెలుపుతూ వారి గురించి కొన్ని మాటలు చెప్తూ వారి కృషిని మరొక్కసారి గుర్తు చేసారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం స్థాపించిన రామకృష్ణ నూనెకి ధన్యవాదాలు తెలుపుతూవారిని సాదరంగా సభకు ఆహ్వానించారు. రామకృష్ణ గారు అప్పటి రోజులను
గుర్తు చేసుకుంటూతమ జ్ఞాపకాలను సభలో పంచుకున్నారు. పూర్వాధ్యక్షులు అందరూ వంతుల వారీగా తమతండ్రి గురించి, సంస్థ గురించి తమ విలువైన జ్ఞాపకాలను సభలో ముచ్చటిస్తూ అందరినీ ఉద్వేగానికి గురి చేసారు. ఇంత చక్కటి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నామని వారిని మరొక్కసారి గుర్తు చేసుకుని అంజలి ఘటించారు. ఫాదర్స్ డేని ఇంతకు మునుపు ఎన్నడూ జరపని విధంగా ఘనంగా చేసారని ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి లక్ష్మిఅన్నపూర్ణ పాలేటిని అభినందించారు.
సభకు విచ్చేసిన పూర్వాధ్యక్షులు అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు తమ తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ తండ్రి నుండి క్రమశిక్షణ మరెన్నో మంచి అలవాట్లు నేర్చుకున్నామని తెలిపారు. రెండు గంటలపైగా ఎంతో అత్మీయంగా, పాలక మండలి ఉపాధిపతి వెంకట్ ములుకుట్ల గారు సభకు నమస్కారాలు తెలిపారు. సరదాగా సాగుతున్న కార్యక్రమానికి ముగింపు పలకవలసిందిగా ప్రత్యేక సభలను నిర్వహించే సరితా రెడ్డి ఈదరని ఆహ్వానించారు. వారు అందరికీ పేరు, పేరునా ధన్యవాదాలు తెలుపుతూ తండ్రితో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.