కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘తలైవి’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రమిది. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బ్రిందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల ఆగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటంతో.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ అందుకుంది. ఈ విషయన్ని చిత్ర నిర్మాతలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. త్వరలో తెలుగు, హిందీ వెర్షన్లను సెన్సార్‌కు పంపనున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అరవింద్ స్వామి, ప్రకాష్‌రాజ్, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్, ఛాయాగ్రహణం: విశాల్ విఠల్.
ఆగష్టులో తలైవి
Related tags :