కుక్క నిద్ర , మీకు ఇప్పుడు ఒక సందేహం కలగొచ్చు, కుక్క విశ్వాసం తెలుసు గాని, ఈ కుక్క నిద్ర ఏంటని, నిజమే కుక్క నిద్ర నుండి మనిషి ఖచ్చితంగా నేర్చుకోల్చింది ఒకటి ఉంది, ఈ కుక్క నిద్ర నుండి నేర్చుకునే సూత్రాన్ని వేదాల కాలంలో రాసారు, అది ఏంటో చూడండి.
ఇంటికి కుక్కని కాపలా పెడితే, ఆ ఇళ్ళు చాలా వరకు సురక్షితంగా ఉంటుందని మనందరికీ తెలిచిందే, ఇప్పుడు ఒక కుక్క ఒక ఇంటికి కాపలా ఉండడం అంటే రాత్రి నిద్రపోదా అని అనుకుంటారు, కానీ అసలు విషయం ఏంటంటే అవి నిద్రపోతాయి, ఎవరైనా వచ్చినప్పుడు మాములుగా కళ్ళు తెరుస్తాయి, తెలిచిన వాడైతే మళ్ళీ కళ్ళు మూయడం లేదా ఆ మనిషి దగ్గరికి వెళ్లడం చేస్తాయి, కానీ అదే తెలియని వాడైతే అరవడం లేదా కరవడం లాంటివి చేస్తాయి.
ఇప్పుడు ఆ కుక్క నుంచి మీకు ఏం అర్ధం అయింది, కుక్క నిద్రపోయిన కూడా, ఆ కుక్క ఇరవై నాలుగు గంటలు ఆ ఇంటి కోసం అప్రమత్తంగా ఉంటాయని కదా, ఇప్పుడు మనం కుక్క నుంచి నేర్చుకోవాల్చింది కూడా అదే అప్రమత్తంగా ఉండడం, దీనినే ఇంగ్లీష్ లో అలర్ట్ గా ఉండడం, మనకు అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే సోయి ఉండాలి అంటాం కదా అదే.
ఒక్క సారి ఆలోచించండి మనలో ఎంత మంది ఇలా అప్రమత్తంగా ఉండగలుగుతున్నాం, ఇలాంటి అప్రమత్తం మనలో లేకపోతే, మన వెనుకే ఉంటూ గోతులు తవ్వే వాళ్ళు, మన కళ్ళు కప్పి మనకే ద్రోహం చేసే వాళ్లు చాలా మందే పుట్టుకొస్తారు, ఇక్కడ నేను అప్రమత్తంగా ఉండడం అంటే ప్రతి చిన్న విషయానికి అనుమానాలు పెట్టుకొని, ఒక అనుమాన పిశాసి లాగా తయారవ్వమని కాదు, మనల్ని ఎవరు మోసం చేయడానికి ఎవరికి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు అని.
చెప్పుడు మాటలు విని, కొంచెం కూడా ఆలోచించకుండా అది నిజమని నమ్మే లక్షణం మీలో ఉంటే, మీరు వాళ్ళకి మోసం చేయడానికి మీరే ఒక అవకాశం ఇస్తున్నట్టు.
మనం ఏదైనా పని చేస్తే ఆ పని గురించి తెలిచిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడంలో తప్పు ఏ మాత్రం లేదు, కానీ మనం ఆ పని చేయకుండా, వాళ్లనే దగ్గరుండి మొత్తం చూసుకోమని వాళ్ళకి ఆ పని అప్పచెప్పారంటే మొదటికే మోసం వస్తది జాగ్రత్త, ఒక వేళ తప్పని పరిస్థితిలో అప్పచెప్పాల్చి వస్తే, బాగా నమ్మకస్థుడికి చెప్పండి.
మనం సంపాదించే డబ్బు, ఇష్టం వచ్చినట్టు అవసరం లేని చోట ఖర్చు పెట్టి, చివరికి ఏం మిగలదు, పరిణామాలు తేడాగా ఉంటాయి, అదే అప్రమత్తంగా ఉండి ఫ్యూచర్ ని ముందే ఊహించి డబ్బులు జాగ్రత్తగా వాడుకుంటే సంతోషంగా ఉండొచ్చు.
ఇవన్నీ కొన్ని సందర్భాలను ఉదాహరణకు తీసుకొని చెప్పాను, ఇవే కాదు ఇలా చాలా రకాల సందర్భాలు ఉంటాయి, అలా సందర్భాన్ని బట్టి అప్రమత్తంగా ఉండడం నేర్చుకోవాలి, అది మన అలవాటులో భాగం అవ్వాలి.
కుక్క నిద్ర మనకు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనడానికి ఒక గొప్ప నిదర్శనం.