* రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ దొంగల నుంచి 17 కోట్లు విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.జ్యోతిష్కుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లో రంగు రాళ్లు చోరీ అయ్యాయని వారం రోజుల క్రితం మురళీకృష్ణ శర్మ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మురళీకృష్ణ శర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. రూ. 17.72 కోట్ల విలువ చేసే నకిలీ రూ. 2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీతో పాటు రూ. 6 లక్షల 32 వేల నగదు, 10 సెల్‌ఫోన్లు, కారు సీజ్ చేశారు. డబ్బు విషయం దాచి రంగురాళ్లు పోయాయని ఆయన ఫిర్యాదు చేశాడు. మురళీకృష్ణతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 90 కోట్ల హవాలా మనీ కేసులో గతంలో మురళీకృష్ణ జైలుకు వెళ్లొచ్చాడు.
* గుంటూరు..మంగళగిరి.మరోసారి బహిర్గతమయ్యాయి పతాకస్థాయికి చేరుకున్న NRI హాస్పిటల్ డైరెక్టర్ల వివాదం.అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీ లే విభేదాల మూలం.కోవిడ్ సమయంలో మరియు అంతకు ముందు ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ కు వచ్చిన ఆదాయ విషయంలో మరియు హాస్పటల్లో నిత్య రాబడి, ఖర్చుల అకౌంట్స్ సంబంధించిన అంశమే వివాదానికి కారణమని సమాచారం.హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్ విభాగాన్ని పర్యవేక్షించే చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్నా మంగళగిరి రూరల్ పోలీసులు.రికార్డులో చూపని లావాదేవీల విలువ సుమారు కోట్లాది రూపాయల లో ఉన్నట్టు సమాచారం.చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు.దర్యాప్తు చేస్తున్న మంగళగిరి రూరల్ పోలీసులు.
* జమ్మూకశ్మీరు శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో పోలీసు ఇన్‌స్పెక్టరు ప్రార్థన కోసం మసీదుకు వెళుతుండగా ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు.పోలీసు ఇన్‌స్పెక్టరు పర్వేజ్ అహ్మద్ మగ్రీబ్ ప్రార్థనల కోసం మసీదుకు వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు.ఉగ్రవాదుల కాల్పుల్లో పర్వేజ్ అహ్మద్ కు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి.పర్వేజ్ అహ్మద్ ను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.జమ్మూకశ్మీర్ ఐజీపీ, డీఐజీ, ఎస్పీ, శ్రీనగర్ టెర్రర్ క్రైం విభాగం అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.పోలీసు బలగాలను రప్పించి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.మృతుడు పర్వేజ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
* మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ తెలిపారు.బుధవారం ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబందించిన వివరాలను వెల్లడించారు.గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ గుండెపోటుతో మృతి చెందాడని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు.హరిభూషణ్ భార్య శారదతో సహా మరికొంతమంది అగ్రనాయకులు కరోన సోకి బాధపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.