WorldWonders

ఇద్దరు ఎస్పీలు తన్నుకున్నారు. చెంపదెబ్బలు ఎగిరితన్నడాలు…

ఇద్దరు ఎస్పీలు తన్నుకున్నారు. చెంపదెబ్బలు ఎగిరితన్నడాలు…

హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీలు కొట్టుకున్నారు. ఒక ఎస్పీని మరో ఎస్పీ చెంప దెబ్బకొడితే, మరో అధికారి అలా కొట్టిన అతడిని కాలితో తన్నాడు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ పోలీసుశాఖలో తీవ్ర దుమారం రేగుతోంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా కులు విమానాశ్రయం సమీపంలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై సీఎం భద్రతా సిబ్బంది, కులు జిల్లా ఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, సీఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ చెంప చెళ్లుమనిపించాడు. అక్కడే ఉన్న, సీఎం జైరాం ఠాకూర్‌ భద్రతాధికారిగా వ్యవహరిస్తున్న బల్వంత్ సింగ్, కులు ఎస్పీ గౌరవ్ సింగ్‌ను కాలితో తన్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హిమాచల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.