NRI-NRT

ఘనంగా టాంటెక్స్ 167వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు

ఘనంగా టాంటెక్స్ 167వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నెలనెలా తెలుగు వెన్నెల శీర్షికన జూన్ 20వ తేదీన
జరిగిన 167వ సాహిత్య సదస్సు చాలా ఆసక్తికరంగా సాగింది.

చిన్నారి మేఘన కుప్పచ్చి మరియు చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతాలతో సభ ప్రారంభమైంది.
అమెరికాలో జరుపుకనే పితృ దినోత్సవం కూడా అదే రోజు కావడంతో, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు
అవకాశం కలిగించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి స్వీయ
కవిత వినిపించారు.

ఈ మాసపు సాహిత్య సభకు ఆకాశవాణి ప్రయోక్త ప్రయాగ రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి
“సమకాలీన కార్యనిర్వహణ, సనాతన సాహితీ మూలాలు” అన్న అంశంపై ప్రసంగించారు. ఉపద్రష్ట సత్యం రామకృష్ణని పరిచయం చేస్తూ ఆకాశవాణికి చేసిన సేవలను, సాహిత్య రంగంలో కృషిని గుర్తు చేశారు.
విశేషంగా ఆకుట్టుకున్న రామకృష్ణ ప్రసంగానికి సభలోవారందరూ సహృదయ స్పందన తెలిపారు.

ప్రధాన వక్త ప్రసంగం తురవాత ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరిసంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి కొన్ని పొడుపు కథలు, జాతీయాలు, ప్రహేళకలు ప్రశ్నలు
జవాబుల రూపంలో చర్చ చేశారు. లెనిన్ వేముల మాట్లాడుతూ జగన్నాథ పండిత రాయలు రాసిన “రస గంగాధర” గ్రంథం నుండి కృష్ణ భగవానుని కీర్తించే ఒక శ్లోకాన్ని తాత్పర్య సహితంగా వివరించారు. తరువాత
ఫాదర్స్ డే సందర్భంగా మాడ దయాకర్ చిగురుమళ్ళ నవాస్ రాసిన చక్కటి పద్యాలు వినిపించారు.

సభలో ప్రసంగాలపై ప్రత్యేకించి ముఖ్య అతిథి ప్రసంగంపై ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ , U.నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఇతర పెద్దలు తమ సహృదయ స్పందనను
తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య
సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పచ్చి , తదితర కార్వవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యులు, స్థానిక
సాహిత్య ప్రియులు హాజరయ్యారు. వారు ముఖ్య అతిథి ప్రయాగరామకృష్ణ కి, ప్రార్థనా గీతం పాడిన
మేఘన, సమన్వితల తోపాటు ముఖ్య కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.