దేశంలోని హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొలీజియం సిఫార్సులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీజేఐ లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారిని కరోనా యోధులుగా గుర్తించాలని కోరారు. కోర్టు సిబ్బంది కుటుంబసభ్యులకు టీకా ఇవ్వాలని.. కరోనాతో ఉపాధి కోల్పోయిన జూనియర్ లాయర్లకు సాయం అందించాలన్నారు. జాతీయ న్యాయ, మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు తుది దశలో ఉందని.. నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్రానికి సమర్పిస్తామని సీజేఐ వెల్లడించారు.
హైకోర్టు జడ్జీల భర్తీపై త్వరగా నిర్ణయం తీసుకోండి
Related tags :