‘అపరిచితుడు’ షూటింగ్ జరుగుతుండగా హీరో విక్రమ్ తనని చెల్లి అని పిలిచారని, అది చూసి దర్శకుడు శంకర్ తీవ్ర నిరాశకు గురయ్యారని సినీ నటి సదా అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఈసారి కథానాయిక సదా విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ‘అపరిచితుడు’ సినిమా చిత్రీకరణ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. విక్రమ్ తనని చెల్లి అని పిలిచేసరికి అది విన్న శంకర్ ‘‘మిమ్మల్ని తెరపై రాముడు, సీతలా చూపిద్దామనుకుంటే మీరు ‘అన్నా-చెల్లి’ అనుకుంటూ ఉన్నారు. ఇది కనుక మీడియాకు లీకైతే నా సినిమా చూడటానికి ఎవరూ రారు’’ అని అన్నారని సదా చెప్పుకొచ్చారు.
లీకులపై సదా వ్యాఖ్యలు
Related tags :