Business

స్కోడా విద్యుత్ కార్లు వచ్చేసింది-వాణిజ్యం

స్కోడా విద్యుత్ కార్లు వచ్చేసింది-వాణిజ్యం

* దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి.హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​కు 36 పైసలు పెరిగి.. రూ.102.32 వద్ద ఉంది. డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.96.89 కి చేరింది.గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.104.67 ఉండగా.. డీజిల్‌ రూ.98.63 కు చేరింది.వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.103.47 వద్ద ఉండగా.. లీటర్​కు​ డీజిల్ ధర రూ.97.47గా ఉంది.మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.52 ఉండగా.. డీజిల్​ రూ. 88.95గా ఉంది.ముంబయిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 104.62గా ఉండగా.. డీజిల్​ ధర 96.48కు చేరింది.చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.55, డీజిల్​ రూ. 93.51గా ఉంది.కోల్​కత్తాలో లీటర్​ పెట్రల్​ ధర రూ. 98.36, డీజిల్​ ధర రూ. 91.80కు చేరింది.

* ఆన్‌లైన్‌లో రుణాల దరఖాస్తు, క్రెడిట్‌ స్కోరును తెలుసుకునే సేవలను అందించే పైసాబజార్‌.కామ్‌ కొత్తగా ఏర్పాటైన ఎస్‌బీఎమ్‌ బ్యాంక్‌ ఇండియాతో కలిసి స్టెప్‌ అప్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించింది. క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోవడం వల్ల రుణాలు, క్రెడిట్‌ కార్డులు రాని వారికి అర్హతను పెంచేందుకు ఈ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హామీగా ఈ స్టెప్‌ కార్డును అందిస్తుంది. ఈ కార్డును బాధ్యతతో వినియోగించిన వారికి క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు తోడ్పడుతుంది. పూర్తిగా డిజిటల్‌లోనే ఈ కార్డును పైసాబజార్‌ ప్లాట్‌ఫాంపై పొందే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉండటం వల్ల సాధారణ రుణాలను, క్రెడిట్‌ కార్డులను పొందడం కష్టంగా ఉన్న వారికి ఈ కార్డు వల్ల ప్రయోజనం లభిస్తుందని పైసాబజార్‌.కామ్‌ సీఈఓ నవీన్‌ కుక్రేజా తెలిపారు.

* ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లలో ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనను కేంద్రం వాయిదా వేసింది. దీనికి నిర్దేశించిన గడువును రహదారుల మంత్రిత్వ శాఖ మరో నాలుగు నెలలు పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. తాజా గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.

* ఇ-కామర్స్‌ సంస్థల కోసం రూపొందించిన ముసాయిదా నిబంధనల విషయంలో వెనక్కి తగ్గొద్దని దేశీయ వర్తక సంఘం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (ఛాఈట్) కేంద్రాన్ని కోరింది. విదేశీ నిధులతో నడుస్తున్న ఇ-కామర్స్‌ సంస్థల ఒత్తిడులకు తలొగ్గొద్దని విజ్ఞప్తి చేసింది. నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ స్వరాలు వినిపిస్తున్న వేళ ఈ మేరకు కాయిట్‌ ప్రధానికి లేఖ రాసింది.

* విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం టెస్లా 2,85,000 లక్షల విద్యుత్తు వాహనాలను చైనాలో రీకాల్‌ చేసింది. క్రూజ్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతోంది. దీంతో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇది భద్రతా పరమైన సమస్యగా మారిందని చైనా అధికారులు చెబుతున్నారు. కొన్ని కార్లలో భద్రతా పరమైన తీవ్ర సమస్యలు ఉన్నట్లు టెస్లా చైనాలో విబో సోషల్‌ మీడియాలో అంగీకరించింది.

* ప్రముఖ దిగ్గజ కార్ల కంపెనీ స్కోడా రాబోయే దశాబ్దానికి తన సరికొత్త- స్కోడా ఆటో స్ట్రాటజీ 2030 ను ప్రకటించింది. ఈ వ్యూహంతో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా రావడానికి కీలక పాత్ర పోషించనుంది. చెక్ కార్ల తయారీదారు స్కోడా 2030 నాటికి కనీసం మూడు ఎలక్ట్రిక్ కారు మోడళ్లను రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్లు స్కోడా ENYAQ iV సిరీస్‌కు తదనంతర కారు మోడళ్లగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది.