WorldWonders

2మిలియన్ డాలర్ల టిప్పులు వేలాడదీశారు

2మిలియన్ డాలర్ల టిప్పులు వేలాడదీశారు

జిగేల్‌జిగేల్‌ మంటూ వెలిగే లైట్ల డెకరేషన్లకు వెరైటీగా అమెరికాలోని ఫ్లోరిడాలో ‘మెక్‌గైర్స్‌ ఐరిష్‌’ పబ్‌ని డబ్బుల నోట్లతో అలంకరించారు. వెయ్యి కాదు లక్ష కాదు ఏకంగా రెండు మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.14 కోట్ల 82లక్షలు) కరెన్సీ నోట్లను సీలింగ్‌కు వేలాడదీశారు. పబ్‌ పైకప్పును ఇలా డబ్బులతో నింపేసింది కస్టమర్లను ఆకట్టుకోవడానికే కాదండోయ్‌, దాని వెనక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 1977లో ప్రారంభమైన ఈ పబ్‌కి ఫస్ట్‌ టిప్‌ కింద డాలర్‌ నోటు వచ్చిందట. ఆ నోటును ‘లక్కీటిప్‌’గా భావించి దానిమీద ఆరోజు తేదీ రాసి టేబుల్‌కి అతికించారట. నెమ్మదిగా వ్యాపారం బాగా పెరగడంతో అలా టిప్పులా వచ్చిన నోట్లన్నింటినీ పక్కనుంచేవారట. ఇది గమనించి కస్టమర్లు కూడా నోటుపైన వారి పేరూ, తేదీ రాసిటిప్‌గా ఇచ్చేవారు. ఇప్పుడా నోట్లే రెండు మిలియన్‌ డాలర్లు అయ్యేసరికి సంతోషంతో వాటితోనే పబ్బును డెకరేట్‌ చేశారన్నమాట.