ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో ఆదివారం భారత అగ్రశ్రేణి ఆర్చర్లు రెచ్చిపోయారు. దాంతో వరుసగా రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించారు. తొలుత దీపిక కుమారి, అంకిత భకత్, కోమాలిక.. మెక్సికన్ టీమ్‌కు చెందిన ఐదా రోమన్, అలెజాండ్ర వాలెన్‌సియా, అనా వాజేకుజ్‌ను 5-1 తేడాతో ఓడించారు. కాగా, ఈ ఏడాది ప్రపంచకప్‌లో వీరికిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రెండు నెలల కిందట గ్వాటిమాలలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ భారత అమ్మాయిలు అదే మెక్సికన్ టీమ్‌ను ఓడించడం గమనార్హం. మరోవైపు మిక్స్‌డ్ టీమ్‌లోనూ భారత స్టార్ జోడీ అతను దాస్, దీపిక కుమారి స్వర్ణం గెలిచారు. నెదర్‌లాండ్స్‌కు చెందిన జెఫ్ వాన్ డెన్ బర్గ్, గాబ్రిలా స్కాలెసర్‌ను 5-3 తేడాతో ఓడించి విజేతగా నిలిచారు. ఇక శనివారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన క్రిస్‌షాఫ్‌ను షూటాఫ్‌లో ఓడించి విజేతగా నిలిచాడు. దాంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొత్తం మూడు విభాగాల్లో స్వర్ణాలు సాధించడం విశేషం.
ఆర్చరీ ప్రపంచకప్‌లో ఇండియాకు 3స్వర్ణాలు
Related tags :