ScienceAndTech

వాట్సాప్‌లో టెంపరర్లీ బ్యాన్ అని వస్తోందా?

వాట్సాప్‌లో టెంపరర్లీ బ్యాన్ అని వస్తోందా?

థర్డ్ పార్టీ యాప్స్‌ను సపోర్ట్‌ చేసే ప్రసక్తే లేదని వాట్సాప్‌ స్పష్టం చేసింది. వాట్సాప్‌ భద్రతా ప్రమాణాలను యాప్స్‌ ధ్రువీకరించలేదని పేర్కొంది. ఒకవేళ ‘టెంపరర్‌లీ బ్యాన్‌డ్‌’ అంటూ మెసేజ్‌ ఏదైనా వస్తే అది తప్పకుండా అధికారిక వాట్సాప్‌ యాప్‌ కాదని, అన్‌సపోర్ట్‌డ్‌ వెర్షన్‌గా గుర్తించాలని సూచించింది. తాత్కాలిక బ్యాన్‌ తర్వాత అధికారిక వాట్సాప్‌ యాప్‌నకు మారకపోతే.. ఆ ఖాతా శాశ్వతంగా బ్యాన్‌ అవుతుందని వెల్లడించింది. ఛాటింగ్‌ వివరాలను ఫోన్ల ద్వారా పంపాలని అడిగే వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ లేదా ఇతర యాప్స్‌ ఏవైనా సరే థర్డ్‌ పార్టీ సంస్థలు తయారు చేసినవే. వాట్సాప్‌ సేవల టర్మ్స్‌ను అనధికారిక యాప్‌లు ఉల్లంఘించాయని వాట్సాప్‌ తెలిపింది. థర్డ్‌ పార్టీ రూపొందించిన అప్లికేషన్‌ను వాడుతుంటే వెంటనే అధికారిక వాట్సాప్‌నకు మారిపోవాలి. లేకపోతే శాశ్వతంగా మీ ఖాతా బ్యాన్‌ అయ్యే ప్రమాదముంది. అధికారిక వాట్సాప్‌ యాప్‌నకు మారాలనుకుంటే ఛాటింగ్‌ హిస్టరీని బ్యాకప్‌ చేసుకోవాలి. మీ ఫోన్‌లో ఏ యాప్‌ను వాడుతున్నారో ముందు తెలుసుకోండి.. దాని కోసం సెట్టింగ్స్‌>హెల్ప్‌>యాప్‌ ఇన్ఫో క్లిక్‌ చేస్తే యాప్‌ వివరాలు వస్తాయి. వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ కాకుండా ఇతర యాప్స్‌ను వాడుతూ ఉండి.. అధికారిక వాట్సాప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఛాట్‌ హిస్టరీని సేవ్‌ చేసుకోమని సూచనలు వస్తాయి. అదే వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ నుంచి అఫీషియల్‌ వాట్సాప్‌నకు మారే సమయంలో ఎలాంటి సందేశాలు రావు. అందుకే ముందుగానే ఛాటింగ్‌ హిస్టరీని బ్యాకప్‌ చేసుకోవాల్సి ఉంటుంది.