నేటి పోటీ యుగంలో ఏరంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని నమ్ముకోవాల్సిందేనని చెబుతోంది యువనాయకి హెబా పటేల్. కెరీర్ ఆరంభంలో మంచి విజయాల్ని అందుకున్నప్పటికీ అనంతరం సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు జరగడం వల్ల వెనకబడ్డానని పేర్కొందీ భామ. లాక్‌డౌన్ విరామ సమయంలో కెరీర్‌లో చేసిన తప్పుల్ని పునఃసమీక్షించుకున్నానని, కథలు ఎంపికలో ఆలోచనాధోరణిని మార్చుకున్నానని తెలిపింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ “24 కిస్సెస్’ సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లో మాత్రమే కనిపించా. ఒకానొక సమయంలో నా కెరీర్ గురించి భయమేసింది. అయితే లాక్‌డౌన్‌లో దొరికిన విరామం వల్ల మంచి కథల మీద దృష్టిపెట్టా. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్’లో నేను పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్న పాత్రలు లభిస్తున్నాయి. నటిగా నా ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించే కథల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
నా ప్రతిభ పూర్తిగా ప్రదర్శిస్తా
Related tags :