తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎక్కువ పదవులు ఇచ్చిందని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా పని చేస్తానని, మెజారిటీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. క్రికెట్ జట్టు మాదిరిగా సమష్టిగా పని చేద్దామంటూ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మరోవైపు, కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ,అంజన్‌కుమార్ యాదవ్, మల్లురవి, కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జి.చిన్నారెడ్డి రెడ్డి సహా పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ నాకు బాగా పదవులు ఇచ్చింది
Related tags :