Politics

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీంకు వెళ్లిన జగన్ సర్కార్-తాజావార్తలు

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీంకు వెళ్లిన జగన్ సర్కార్-తాజావార్తలు

* సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది.నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.ఇవాళ విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

* జులై 5 నుంచే ఛార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షలు జరగనున్నాయి. ICAI ఎగ్జామ్స్ కు సంబంధించిన 3 పిటిషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరగ్గా..పరీక్షల నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. కరోనా బారిన పడిన విద్యార్థులకు మాత్రం పరీక్ష రాయాలా వద్దా అనే ఆప్షన్ ఇవ్వడాన్ని ICAI పరిశీలించాలని సూచించింది. ఫైనల్ పరీక్షలు జులై 5-జులై 20 వరకు, ఫౌండేషన్ పరీక్షలు జులై 24, 26, 28, 30 తేదీల్లో జరగనున్నాయి.

* కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం వైయస్‌.జగన్‌ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం పనులకు శ్రీకారం చుడతారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు.

* మంగళగిరి మండలం ఆత్మకూరు లోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం (శివాలయం) లోని 50 అడుగులు ధ్వజస్తంభం సోమవారం సాయంత్రం విరిగిపడింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.

* తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర అ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యాప్ ‘దిశ’. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ డెమోను మంగళవారం గొల్లపూడిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ నిర్వహించారు. యాప్ ద్వారా చేసిన కాల్‌కు పోలీసులు వెంటనే స్పందించారు. మహిళకు ధైర్యం చెప్పి 4 నిమిషాల్లో చేరుకున్నారు. యాప్ పనితీరుపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 18 దిశ పోలీస్ స్టేషన్‌లు పెట్టామని తెలిపారు. దిశ చట్టం అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ప్రత్యేక కోర్టుల కోసం హైకోర్టు సీజేతో మాట్లాడుతున్నామన్నారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో దిశ యాప్ అందుబాటులో ఉందన్నారు. యాప్‌ స్టోర్‌లో దిశను పోలిన యాప్‌లను తొలగించాలన్నారు.

* అన్ని రాష్ట్రాలూ ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది. అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్ లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఇవ్వాళ విచారణ చేసింది. కరోనాతో ఆర్థికంగా బాగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. మహమ్మారి ఉన్నన్నాళ్లూ వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని, కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆహారా ధాన్యాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. అసంఘటిత రంగ కార్మికులతో జాతీయ డేటాబేస్ ను రూపకల్పనలో కీలకమైన సాఫ్ట్ వేర్ అభివృద్ధి ఆలస్యమవడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. జులై 31లోగా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి డేటాబేస్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారం తీసుకోవాలని సూచించింది. కార్మికుల నమోదు కోసం రాష్ట్రాలూ కాంట్రాక్టర్లందరి వివరాలనూ వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచనలిచ్చింది.

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం.ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంలో ఏపీ హోం శాఖ కార్యదర్శి డిజిపి కి మరోసారి సమన్లు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ.ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సమన్లు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ.ఎంపీ రఘురామ అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం.నివేదిక ఎందుకు జాప్యం అవుతుందోనని ఏపీ అధికారులను నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ.ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు.గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశం.దీనికి సంబంధించి ఏపీ హోం శాఖ కార్యదర్శి డీజీపీ ని హెచ్చరించిన ఎన్హెచ్ఆర్సీ.

* చిన్న‌త‌నంలోనే పెళ్లి.. అంతంత మాత్రం చ‌దువు.. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్ట‌గానే భ‌ర్త మృతి.. స్కూల్లో వంట చేస్తూ అర‌కొర జీతంతో పిల్ల‌ల‌ను పోషిస్తున్న ఓ మ‌హిళ‌కు ఆశా వ‌ర్క‌ర్ ఉద్యోగం వ‌రించింది. కానీ ఆ ఉద్యోగంలో కొన‌సాగాలంటే టెన్త్ క‌చ్చితంగా పాస్ అయి ఉండాల‌న్న నిబంధ‌న‌ను ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. దీంతో స‌దరు మ‌హిళ 57 ఏండ్ల వ‌య‌సులో ప‌ది పాసై అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచింది.

* పిల్ల‌లపై ప్రేమ‌తో ఎవ‌రైనా బిస్కెట్‌లు, చాక్లెట్‌లు కొనిపెడుతారు. అవ‌స‌ర‌మైతే షాప్‌కు తీసుకెళ్లి వాళ్లు అడిగింద‌ల్లా కొనిస్తారు. కానీ కేర‌ళ రాష్ట్రం కాస‌ర్‌గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో మాత్రం ఓ తండ్రి త‌న కూతురుపై ప్రేమ‌తో ఏకంగా బీరు తాపించిండు. కానీ బీరు తాగిన బాలిక‌ స్పృహ త‌ప్పి ఆస్ప‌త్రి పాల‌య్యింది. దాంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.