అక్షయ్‌కుమార్, కత్రినా కలిసి ‘తీస్‌మార్‌ఖాన్’, ‘వెల్‌కమ్’, ‘నమస్తే లండన్’, ‘సింగ్ ఈజ్ సింగ్’ చిత్రాల్లో నటించారు. ‘తీస్‌మార్ ఖాన్’ చిత్రీకరణ సందర్భంగా సెట్లో అక్షయ్ దగ్గరికి వెళ్లి ‘నీకు రాఖీ కట్టాలనుకుంటున్నాను’ అని చెప్పిందట. దానికి స్పందనగా.. ‘చెంపదెబ్బ కావాలంటే కొట్టు’ అని అక్షయ్ బదులిచ్చాడట. ‘ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే. అందుకే రాఖీ కట్టడం తప్పుగా అనిపించలేద’ని ఆమె చెప్పుకొచ్చింది. అయితే.. సెట్లో జరిగిన సంఘటనతో నిరాశకు గురయ్యానని ఆమె చెప్పింది. ఇలాంటి సంఘటననే మరోటి పంచుకుందామె. అదే రోజు షూటింగ్ పూర్తవగానే స్నేహితురాలి ఇంటికి వెళ్లగా ఇంతలోనే అర్జున్‌కపూర్ అక్కడికి వచ్చాడట. అతనికి రాఖీ కట్టాలని ప్రయత్నించగా.. అర్జున్ అక్కడి నుంచి జారుకున్నాడట. తర్వాతి రోజు కూడా రాఖీ కట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది.
పాపం…రాఖీ అదృష్టం లేదు
Related tags :