* ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడే నలుగురు పట్టివేత.* మైనర్లు కావడంతో జె.జె.బోర్డు ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు.* నలుగురి నిందితుల నుండీ రూ. 10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలు స్వాధీనం.* తాగుడు, తదితర జల్సాలకు అలవాటు పడి చిన్న వయస్సులోనే దొంగలుగా మారిన వైనం.అనంతపురం జిల్లా ఇటుకలపల్లి మరియు రాప్తాడు పోలీసులు ఈరోజు నలుగురు అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేశారు.వీరిలో నలుగురు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.వీరందరి నుండి రూ.10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
* కట్టుకున్న భర్తనే అత్యంతదారుణంగా కడతేర్చిన ఓ మహిళ కథ ఇది.అడ్డుగాఉన్నభర్త ను వదిలించుకునేందుకు కొందరిసహకారంతో హత్య చేయించింది.ఆనేపం తనపైకి రాకుండా ఉండేందుకు అత్యంత ప్రణాళిక రచించింది.ఏమీ ఎరగనట్టు నాటకం ఆడింది. తమదైన రీతిలో విచారించిన పోలీసులకు అసలు విషయం చెప్పింది.నెల్లూరు నగరంలో సంచలనం కలిగించిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.నగరంలోని జాకీర్ హుస్సేన్ నగర్ లో వారం క్రితం జరిగిన ఫయాజ్ హత్య కేసును నవాబ్ పేట పోలీసులు ఛేదించారు.భర్త వేధింపులు తట్టుకోలేకే స్నేహితుల సాయంతో హత్యకు సహకరించినట్లు భార్య కల్యాణి ఒప్పుకుంది.నిందితురాలు కల్యాణితో పాటు కరిముల్లా, ప్రసాద్, మల్లి, ప్రకాష్ లను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
* గుంటూరు..కడప జిల్లా బద్వేలు లో శిరీష హత్య ను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కి వివరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ.భా ది త కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం.సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని వాసి రెడ్డి పద్మ వెల్లడి.
* గుంటూరు జిల్లా కాకుమాను తహశీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డఇంచార్జి ఆర్ ఐ చంద్రశేఖర్, విఆర్వో నరసింహారావు ని సస్పెండ్ చేసిన కలెక్టర్ వివేక్ యాదవ్