ScienceAndTech

జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కలకలం

జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కలకలం

జమ్మూ కశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.

బుధవారం మళ్లీ జమ్మూ సైనిక స్థావరాలకు సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు.

నిన్న అర్ధరాత్రి  1:30 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు  సంచరించాయి.

మొదట కాలుచక్‌  కంటైన్మెంట్ వద్ద ఓ డ్రోన్ కనిపించగా ఆ తర్వాత కాసేపటికే రత్నుచక్‌ సైనిక ప్రాంతంలో మరో డ్రోన్ గుర్తించారు.

ఇక మూడోది కుంజావనీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కనిపించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలిసింది. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

కాగా జమ్మూ సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం 7 డ్రోన్లు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది.