WorldWonders

ఈ వజ్రం మీ సొంతమైతే చావు తప్పదు

ఈ వజ్రం మీ సొంతమైతే చావు తప్పదు

(1) మీకు తెలుసా శీతలబోషానం (ఫ్రిడ్జ్) లో చల్లటి నీటికంటే వేడినీరే త్వరగా గడ్డకడుతుంది.

(2) శరీరకండరాలలో నాలుకే అత్యంతదృఢమైనది.

(3) మధ్యచెవిలోవున్న Stapidius అనే సన్నని ఎముక శరీరభాగాలలో అతిచిన్న అవయవం.ఒక మిల్లిమీటరు పొడుగుంటుందంతే.

(4) మరుగుజ్జు విల్లో చెట్టును ప్రపంచంలో అతి చిన్నచెట్టుగా గుర్తించారు.2 లేదా మూడు సెం.మీ. ఎత్తు పెరుగుదంతే.

(5) May fly అనే ఈగ జీవితకాలం కేవలం 24 గంటలే. ప్రపంచంలో అతితక్కువకాలం జీవించేప్రాణి ఇదే.

(6) జలగకు 32 మెదడులు వుంటాయి.

(7) రోడిషియాలోని రిడ్జ్ బ్యాక్ అనేకుక్క పోరాటంలో సింహాన్ని కూడా చంపగలదు.

(8) న్యూగినియాలో వున్న Baton Rouge బల్లిజాతి ప్రాణి రక్తం నీలిరంగులో వుంటుంది.

(9) పూర్వం బారోసోరస్ అనే డైనోసార్ (రాకాసిబిల్లి) అతి పెద్ద ఆకారం కలది. ఎంత పెద్దదంటే మొత్తం శరీరానికి రక్తంపంపు చేయటానికి ఏకంగా 8 గుండెలుండేవి.

(10) కుక్కకంటె పందే తెలివైంది. బాగా వయసులోనున్న పందికి మూడుసంవత్సరాల బాలుడుకి వున్నంత తెలివివుంటుంది.

(11) Flatwoms, Nemadoes, జెల్లిఫిస్ లకు రక్తప్రసరణ వ్యవస్థ లేదు కనుక ఈ జీవులకు రక్తంవుండదు.

(12) కుక్కలలో మేలుజాతి కుక్క లాబ్రడార్. అత్యంత ప్రమాదకరమైనది అమెరికన్ పిట్ బుల్ టెర్రిర్‌ కుక్క.

(13) సముద్రగర్భంలో నివసించే స్పాంజి ప్రాణికి మెదడు వుండదు.

(14) మనిషిని బాగా రంజింపచేసే ప్రాణులలో డాల్ఫిన్లు మొదటగా వుంటాయి.

(15) భారతదేశంలో దొరికిన హోప్ వజ్రం, ప్రపంచంలో ఖరీదైన వజ్రాలలో మూడవస్థానాన్ని ఆక్రమించింది.ఈ వజ్రం 1620 సం॥లో ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరు గనులలో దొరికింది. ఈ వజ్రాన్ని ఎవరుకొన్నా, చివరికి ముట్టుకొన్నా వారికి మరణం సంభవిస్తుందనే ప్రధవుంది. దీని విలువ 350 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ చేస్తుంది. ఇది ప్రస్తుతం వాషింగ్టన్ చరిత్ర మ్యూజియంలో వుంది. బరువు 48 కేరట్లు. (సుమారు 10 గ్రాములు).

(16) డెమాస్కస్, ఏథెన్స్, లెబనాన్ లోని సీడెన్, ఇరాన్ లోని రాయ్, భారతదేశంలోని కాశీ, జెరుసాలెం, ఈజిప్ట్ లోని పయూమ్, లెబనాన్ లోని బైబ్లోస్, పాలిస్తీనాలోని జెరికో మొదలైన నగరాలు ప్రపంచంలోనే అతిప్రాచీన నగరాలు.

(17) మానవుడు నౌకాయానాన్ని కనిపెట్టి ఇప్పటికి 10 వేల సంవత్సరాలైతోంది.

(18) 1882 లో విద్యుత్తుతో నడిచే గాలిఫంకా ( ప్యాన్) ను ఫిలిప్ డీహెల్ కనుగొన్నాడు. 1821 లో మైకేల్‌ పారడే విద్యుత్తు మోహరును కనుక్కోవడం జరిగింది.

(19) 1859 లో మొదటిసారిగా పెట్రోలియం ఉత్పత్తి జరిగింది. ప్లోరిడారాష్ట్రంలోని టటైస్ విల్లే గ్రామంవద్ద మొదటిసారిగా చమురు బావిని త్రవ్వడం జరిగింది.