DailyDose

జగిత్యాల పోలీసులకు చెమటలు పట్టిస్తున్న లేడీ ఎస్పీ-నేరవార్తలు

జగిత్యాల పోలీసులకు చెమటలు పట్టిస్తున్న లేడీ ఎస్పీ-నేరవార్తలు

* ఏసీబీ వరుస దాడులతో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ క్షేత్ర స్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం ఆరంభించారు. ఇటీవల కాలంలో జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, కథలాపూర్ ఎస్ఐ పృథ్వీథర్ గౌడ్, కానిస్టేబుల్ రమేష్‌లు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీకి చిక్కారు. దీంతో, అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గురించి ఆరా తీయించిన ఎస్పీ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం ముగ్గురు ఎస్‌ఐలను అటాచ్డ్ చేశారు. అయితే, జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ వరుస దాడులు అధికారులను అలర్ట్ చేశాయి. దీంతో, ఎస్పీ సింధూ శర్మ అవినీతికి పాల్పడుతున్న పోలీసుల డాటా సేకరించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.

* ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మూలలు మాత్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంటాయి. చాలాకాలంగా భాగ్యనరంపై ఇలాంటి అపవాదు ఉంది. ఇది నిజమే అని మరో సారి తేలింది. బీహార్‌లోని దర్బంగా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న పేలుడుకు సెంటర్ పాయింట్ హైదరాబాద్ పాతబస్తీలో తేలింది. ఈ నెల 17న దర్బంగా రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో మకాం వేశారు. అసిఫ్‌నగర్‌‌లో బట్టల దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ స్వస్థలం యూపీలోని కురిసి అని అధికారులు తెలిపారు.

* తోటపల్లి బ్యారేజి వద్ద నదిలో దూకిన ప్రేమ జంట మృతదేహాలు లభ్యం..రెండు రోజుల క్రితం నాగావళి నదిలో దూకిన ప్రేమ జంట…42 గంటల తరువాత నదిలో తేలిన మృతదేహాలు..ఒకరినొకళ్ళు చున్నీతో కట్టుకొని నదిలో దూకిన ప్రేమ జంట.