* రెండువారాల క్రితం కుమారుడు స్వరూప్ కోవిడ్ కారణంగా మృతి చెందగా… కొద్దిసేపటి క్రితం భర్త దశరథ రాజు కూడా తుదిశ్వాస విడవడం అత్యంత బాధాకరం.
* ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి ఇంట విషాదం నెలకొంది.ఆమె భర్త రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
* సింగర్ సునీత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. తన భర్త రామ్ వీరపనేని ప్రొడక్షన్ హౌజ్ మ్యాంగో మాస్ మీడియా వింగ్‌ను చూసుకోనుందట సునీత. రామ్ వీరపనేని ఇటీవలే యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ ఏక్ మినీ కథ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం వెబ్‌సిరీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు రామ్.కంటెంట్, ఇతర ప్రొడక్షన్ బాధ్యతలను సునీత పర్యవేక్షించనుందని రామ్ వెల్లడించినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. మరో విషయమేంటంటే సునీత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించిన ఐకానిక్ మ్యూజికల్ షో పాడుతా తీయగాకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది. ఒకవేళ సునీత నిర్మాతగా మారుతుందనేది నిజమే అయితే ఆమె ఫాలోవర్లకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
* కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించడం జరుగుతుంని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయశుద్ధి, శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంకాలపు పూజలు నిర్వహించబడుతాయన్నారు. రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడే పరోక్ష సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
* నారదా కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్టు సందర్భంగా మమతా బెనర్జి వ్యవహరించిన తీరుపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయ్యింది. అయితే ఆ సందర్భంగా వ్యవహరించిన తీరుపై మమతాబెనర్జి సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ఇచ్చిన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనుందుకుగానూ దీదీకి, బెంగాల్ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది.
* కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఢిల్లీ నుంచి వస్తున్న కొత్తగా నియమితులైన బీజేపీ కార్యదర్శి అమిత్ వాల్మీకి స్వాగతం పలికేందుకు ఢిల్లీ-ఘాజియాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానించే హిండన్ ఎలివేటెడ్ రహదారి ప్రారంభం వద్దకు సుమారు 400 మంది బీజేపీ కార్యకర్తలు చేరగా మరోవైపున ఉన్న రైతులు వందల సంఖ్యలో తమవైపునకు వచ్చి దాడి చేశారని ఘజియాబాద్ బీజేపీ యూనిట్ నగర అధ్యక్షుడు సంజీవ్ శర్మ ఆరోపించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
* తెలతెల్లవారగానే గొంతులో టీ పడకపోతే మనలో చాలా మందికి ఎటూ తోయదు. కొంత మంది టీ తాగకుండా ఏ పనిచేయలేరు. మరికొందరైతే రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతారు. బ్రిటిష్ వాళ్లు అలవాటు చేసిపోయిన టీకి దేశంలో అంత క్రేజ్ పెరిగింది. అందరూ అంతగా ఇష్టపడే టీ తయారీకి అవసరమయ్యే టీ పొడి కూడా పెద్దగా ఖరీదైనదేమీ కాదు. మహా అయితే కేజీ రూ.300 లేదా రూ.400 ఉంటుంది.కానీ, తమిళనాడులోని నీలగిరిలో సాగయ్యే నీలగిరి సిల్వర్ నీడిల్ వైట్ టీ మాత్రం వేలంలో రికార్డు ధర పలికి సరికొత్త రికార్డు సృష్టించింది. నీలగిరికి దగ్గర్లోనే ఉండే కూనూరులో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ నుంచి విదేశాలకు ఎగుమతి అయిన ఈ సిల్వర్ నీడిల్ టీ.. ఇంటర్నేషనల్ టీ వేలంలో కేజీ రూ.16,400 ధర పలికింది. టీ ఉత్పత్తిలో తమిళనాడులోని నీలగిరికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది.ఇక్కడ ఆర్తొడాక్స్ టీ, గ్రీన్ టీ, సిల్వర్ నీడిల్ టీ వంటి రకరకాల టీ పొడులను ఉత్పత్తి చేస్తారు. అంతేగాక ఇక్కడ ప్రభుత్వం అధ్వర్యంలో నడిచే టీ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. వాటితోపాటే 100కు పైగా ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా నడుస్తున్నాయి. నీలగిరి జిల్లాలో 60 వేల మందికి పైగా రైతులు తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే టీ పొడిని కూనూరులో జరిగే ఇంటర్నేషనల్ టీ వేలం కోసం తీసుకెళ్తారు. అక్కడ విదేశాల నుంచి వచ్చే టీ కంపెనీల వారు వేలంలో టీ పొడిని కొంటారు.
* ముంబై – పుణె- హైదరాబాద్ వెళ్లే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌కు వయా జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కనెక్టివిటీ ఇవ్వాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రధాన కార్య నిర్వహణాధికారి ఆర్‌ఎన్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..జహీరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అన్నారు.
* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసులు 6,23,510కి పెరిగాయి. 6,06,461 మంది కోలుకున్నారు. మరో 13,388 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3661కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,09,802 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
* మహిళలు, పురుషుల మధ్య సమానత్వం దిశగా అంటూ దక్షిణాఫ్రికా సంచలన ప్రతిపాదన చేసింది. స్వలింగ వివాహాలు, బహు భార్యత్వం ఇప్పటికే చట్టబద్ధమైన ఆ దేశంలో బహు భర్తృత్వాన్ని కూడా అనుమతించాలన్నదే ఆ ప్రతిపాదన. ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేందుకు మహిళలకు చట్టపరంగా అనుమతిన్వివడం వివాహ వ్యవస్థను మరింత సమ్మిళితం చేస్తుందంటూ ఆ దేశ హోంశాఖ పేర్కొనడం విస్తృత చర్చకు తెరలేపింది. ఈ ప్రతిపాదనపై సంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ముసా సెలెకు ఒకరు. ఆయనకు నలుగురు భార్యలు. బహు భర్తృత్వానికి అనుమతిస్తే ఆఫ్రికా సంస్కృతి ధ్వంసమవుతుందని ముసా అన్నారు. ‘అలాంటి జంటల పిల్లల పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
* తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని.. వాళ్లని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. అలాగని ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నీటివివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
* తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఒకవైపు, కేసీఆర్ మరోవైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు.
* వస్తు, సేవల పన్ను విధానం వల్ల సంక్లిష్టంగా ఉన్న పరోక్ష పన్ను విధానం సరళంగా మారడమే కాకుండా, వస్తువులపై పన్ను రేట్లు తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నాలుగేళ్లలో 66 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని వివరించారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె బుధవారం వరుస ట్వీట్లు చేశారు. జీఎస్టీ రాకముందు ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, మరో 13 రకాల సెస్సులు కలిపి మొత్తం 17 రకాల సుంకాలు ఉండేవని నిర్మలా సీతారామన్ అన్నారు. 2017 జులై 1 నుంచి ఇవన్నీ మాయమైపోయాయని చెప్పారు.
* రూ.లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీకి సీఈఓ. కాలు మీద కాలేసుకొని.. కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపే వసతులు. అసలు కంపెనీలో కిందిస్థాయి వర్కర్ల గురించి పట్టించుకునే సమయమూ ఉండకపోవచ్చు. కానీ, అవేవీ ఆయనకు అడ్డు రాలేదు. తన కంపెనీలో ఫుడ్ డెలివరీ విభాగంలో ఓ డెలివరీ బాయ్‌గా చేరిపోయారు. ఉత్సాహంగా తోటి బాయ్స్‌తో పోటీ పడుతూ సమయానికి వినియోగదారులకు ఆహారాన్ని అందించారు. ఆయన ఎవరో కాదు.. ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీ.
* తెలంగాణలో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. అందరికీ అందుతున్న పథకాలే ఎస్సీలకు అందుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని అగౌరవ పరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారన్నారు.
* దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఇటీవల వెలుగులోకి వస్తున్నా.. వీటి పుట్టుక ఎప్పుడో మొదలైందని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రెండున్నర నెలల క్రితమే వీటి ఉనికి ఆరంభమైంది. తిరుపతిలో ఏప్రిల్‌లో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో తాజాగా డెల్టా ప్లస్ రకాన్ని సీసీఎంబీ గుర్తించడం గమనార్హం. కొవిడ్ రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా వేరియంట్ బి.1.617 రకాన్ని 2020 ఆఖర్లోనే గుర్తించారు. మొదట్లో ఈ రకం కేసులు పరిమితంగానే నమోదయ్యాయి.
* ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయంటూ ఇటీవల పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరాను తగ్గించి వృథాను అరికట్టేందుకు నెలవారీ కొనుగోళ్లపై పరిమితులు విధించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఇకపై ఈ ఆసుపత్రులు టీకాల కోసం కొవిన్ ద్వారా మాత్రమే ఆర్డర్లు పెట్టుకోవాలని, నేరుగా తయారీ సంస్థల నుంచి డోసులు కొనుగోలు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.
* ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ సరికొత్త క్షిపణినిని ఆవిష్కరించింది. ఈ 5వ తరం క్షిపణి పేరు సీ బ్రేకర్‌గా పేర్కొంది. ఇది స్వీయనియంత్రణలో సుదూర లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తుందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ క్షిపణి శతఘ్ని దళం, నావికా దళానికి అదనపు బలాన్నిస్తుందని కంపెనీ పేర్కొంది. భూమిపై నుంచి నౌకలపై నుంచి దీనిని ప్రయోగించవచ్చు.