Business

మళ్లీ 35పైసలు పెంచారు-వాణిజ్యం

మళ్లీ 35పైసలు పెంచారు-వాణిజ్యం

* ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌.దేశంలో రెండో రోజుల విరామం అనంతరం పెట్రోల్‌ రేట్లు శుక్రవారం మరోసారి పైకి కదిలాయి.అయితే, డీజిల్‌ రేట్లను మాత్రం చమురు కంపెనీలు పెంచలేదు.ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్‌ ధరలు చేరగా.. తాజాగా 35 పైసలు పెరిగింది.పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ రేటు రూ.100కు చేరువైంది.ప్రస్తుతం రూ.99.16 ధర పలుకుతోంది. డీజిల్‌ రూ.89.15కు పెరిగింది.ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ రూ.105.24, డీజిల్‌ రూ.96.72కు చేరింది.దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటింది.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వంద మార్క్‌ను దాటింది. డీజిల్‌ రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని పలు రాష్ట్రాల్లో డీజిల్‌ రూ.100 దాటింది.మే 4వ తర్వాత ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలు వరుసగా 33వ సార్లు పెరిగాయి.పాక్‌కు సమీపంలో ఉన్న రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌లో ఫిబ్రవరిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ధర ఇక్కడే పలుకుతోంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.40కు చేరగా.. డీజిల్‌ రూ.102.42కు పెరిగింది.. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో వాహనదారులు బంకులు వెళ్లాలంటేనే జంకుతున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు.ఢిల్లీలో పెట్రోల్‌ రూ.99.16.. డీజిల్‌ రూ.89.18.ముంబైలో పెట్రోల్‌ రూ.105.24.. డీజిల్‌ రూ.96.72.కోల్‌కతా పెట్రోల్ రూ.99.04.. డీజిల్‌ రూ.92.03.చెన్నైలో పెట్రోల్‌ రూ.100.13.. డీజిల్‌ రూ.93.72.బెంగళూరులో పెట్రోల్ రూ.102.48.. డీజిల్ రూ.94.54.హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.103.05.. డీజిల్‌ రూ.97.20.విజయవాడలో పెట్రోల్‌ రూ.105.17 డీజిల్‌ రూ.98.73.తిరువనంతపురంలో పెట్రోల్‌ రూ.101.14, డీజిల్‌ రూ.95.74.జైపూర్‌లో రూ.105.91.. డీజిల్‌ రూ.98.29.పాట్నాలో పెట్రోల్ రూ.101.21.. డీజిల్‌ రూ.94.52.చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.95.36.. డీజిల్‌ రూ.88.81.భోపాల్‌లో రూ.107.43.. డీజిల్‌ రూ.97.93.భువనేశ్వర్‌లో పెట్రోల్ రూ.99.95.. డీజిల్ రూ.97.19.శ్రీనగర్‌లో పెట్రోల్‌ రూ.102.11.. డీజిల్‌ రూ.92.80.

* పెట్రో ధరల బాటలో వంట గ్యాస్‌ ధరలూ భగ్గుమన్నాయి. గత రెండు నెలలుగా నిలకడగా ఉన్న వంట ఇంధనం ధరలు గురువారం ఒక్కసారిగా పేలాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరను కేంద్రం రూ.25.50 పెంచింది. బుధవారం వరకు దీని ధర రూ.861.50 ఉండగా.. ఇప్పుడు రూ.887కు చేరింది. అలానే 19 కిలోల వాణిజ్య వినియోగ సిలిండర్‌పై రూ.84.50 పెంచారు. దీని ధర రూ.1730.50కి చేరింది. పెట్రోలు, డీజిల్‌ తరహాలోనే దూరం ఆధారంగా వీటి ధరల్లో మార్పులు ఉంటాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలిండరు ధర రూ.887కు చేరగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా రూ.911.50కు పెరిగింది.

* చాలా మంది బ్యాంక్ లాక‌ర్ ప్రారంభించేందుకు వారి ద‌గ్గ‌ర‌లోని బ్యాంకు శాఖ‌కు వెళ‌తారు. అయితే ఆ బ్యాంకు శాఖ‌లో కొన్ని లాక‌ర్‌లే అందుబాటులో ఉంటే మీకు స‌మ‌యానికి ల‌భించ‌క‌పోవ‌చ్చు. అప్పుడు బ్యాంకు, మీకు లాక‌ర్ స‌దుపాయాన్ని అనుమ‌తిని తిర‌స్క‌రిసస్తుందిమ‌రి ఏం చేయాలి?ఆ బ్యాంకును వ‌దిలేసి దూరంగా ఉన్న మ‌రొక బ్యాంకును సంప్ర‌దించడానికి బ‌దులుగా, బ్యాంకు లాక‌ర్ కోసం రిజిస్ట‌ర్ చేసుకుంటే అందుబాటులో ఉన్న‌ప్పుడు మీరు లాక‌ర్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంద‌న‌ల ప్ర‌కారం, బ్యాంకులు లాక‌ర్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌ను నిర్వ‌హించాలి. లాక‌ర్ కోసం సంప్ర‌దించిన‌వారికి వెయిట్ లిస్ట్ నంబ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని తెలిపింది.బ్యాంకు లాక‌ర్లు ఫ‌స్ట్-క‌మ్-ఫ‌స్ట్‌-స‌ర్వ్ బేసిస్ లో ల‌భిస్తాయి. ఎవ‌రైనా లాక‌ర్ నుంచి నిష్ర్క‌మిస్తే ఆ అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. బ్యాంకు లాక‌ర్ ఉప‌యోగించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవ‌సరం లేద‌న్న విష‌యం గుర్తుంచుకోండి.ఫీజులు-ఛార్జీలు:మీ వ‌స్తువుల‌ను బ్యాంకు లాక‌ర్‌లో పెట్టినందుకు గాను బ్యాంకుకు ఫీజు చెల్లించాలి. కొన్ని సార్లు బ్యాంకులు లాక‌ర్ స‌దుపాయం ఇచ్చేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించ‌మ‌ని కూడా అడ‌గ‌వ‌చ్చు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌ను మూడు సంవ‌త్స‌రాల అద్దెకు స‌మాన‌మైన‌ ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించ‌మ‌ని అడిగేందుకు అనుమ‌తి ఉంది. ఏదైనా అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు లాకర్‌ను తెరిచేందుకు వీలుగా ఛార్జీలు తీసుకుంటాయి. ఎఫ్‌డీని సెక్యూరిటీ డిపాజిట్‌గా ప‌రిగ‌ణిస్తాయి. ఎఫ్‌డీపై వ‌చ్చే వ‌డ్డీని అద్దెగా బ్యాంకు పొందే విధంగా సూచ‌న‌లు పాటించ‌వ‌చ్చు.రెగ్యుల‌ర్ ఆప‌రేష‌న్:మీరు లాక‌ర్‌ను రెగ్యుల‌ర్‌గా ఆప‌రేట్ చేస్తుండాలి లేక‌పోతే బ్యాంకు దాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంటుంది. అయితే ర‌ద్దు చేసే ముందు బ్యాంకు నోటీస్ పంపుతుంది. మ‌ధ్య‌స్థంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న వినియోగదారులు కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి లాకర్‌ను ఆపరేట్ చేయాలి, అయితే అధిక-రిస్క్ ఉన్న వినియోగదారులు కనీసం సంవత్సరానికి ఒకసారి దీన్ని ఆపరేట్ చేయాలి. ఆర్థిక లేదా సామాజిక స్థితి, వ్యాపార కార్యకలాపాల స్వభావం, వినియోగ‌దారుల స్టేట‌స్ వంటివి ప్రామాణికంగా చేసుకొని బ్యాంకులు తమ వినియోగదారులను తక్కువ నుంచి అధిక రిస్క్ ప్రొఫైల్స్‌గా వర్గీకరిస్తాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నాలుగు రోజుల నష్టాల పరంపరకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై ఆద్యంతం ఊగిసలాటలో పయనించిన సూచీలు ఇంధన, స్థిరాస్తి, టెలికాం, బ్యాంకింగ్‌ రంగాల నుంచి మద్దతు లభించడంతో చివర్లో పుంజుకున్నాయి. సెన్సెక్స్ చివరకు 166 పాయింట్ల లాభంతో 52,484 వద్ద.. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 15,722 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.77 వద్ద నిలిచింది.

* డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్‌ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పేటీఎం యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతిఒక్కరికీ ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 200 జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపుల సాధనాలను విస్తృతంగా వినియోగించి డిజిటల్‌ ఇండియాను విజయవంతం చేయడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషించారని సంస్థ పేర్కొంది.