Movies

హవాలా కేసులో యమీ గౌతం

హవాలా కేసులో యమీ గౌతం

మనీ లాండరింగ్‌ కేసులో నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. ఈమేరకు జులై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్‌ ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమన్లు అందుకున్నారు. ‘ఉల్లాస ఉత్సాహ’ కన్నడ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్‌ పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘విక్కీ డోనర్‌’, ‘యాక్షన్‌ జాక్సన్‌’, ‘బద్లాపూర్‌’, ‘ఉరి’, ‘బాలా’ చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఆమె ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.