Business

జియో బ్యాలెన్స్ అయిపోతే లోన్ తీసుకోవచ్చు-వాణిజ్యం

జియో బ్యాలెన్స్ అయిపోతే లోన్ తీసుకోవచ్చు-వాణిజ్యం

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో శనివారం సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. వినియోగదారులు పని మధ్యలో ఏ మాత్రం అసౌకర్యానికి గురికాకుండా, డేటా కొరత రాకుండా చూసేందుకు ఎమర్జెన్సీ డేటా లోన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ శనివారం వెల్లడించింది. ఎమర్జెన్సీ డేటా లోన్‌ ఫీచర్ కింద.. వినియోగదారులు ముందుగా డేటా లోన్‌ తీసుకుని తర్వాత చెల్లించొచ్చు. ప్రతి ఒక్కరూ ఐదు డేటా రీఛార్జ్‌ ప్యాక్‌ల వరకు లోన్‌ పొందొచ్చు. ఒక్కో ప్యాక్‌తో 1జీబీ డేటా లభిస్తుంది. అందుకు రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. లోన్‌ వాడుకోవాలంటే అప్పటికే వ్యవధి ముగియని ప్లాన్‌ ఉండాలి. ఆ బేస్‌ప్లాన్‌ చెల్లుబాటు అయ్యేవరకు లోన్‌ తీసుకున్న డేటాను వినియోగించుకోవచ్చు.

* రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ ‘మీడియాపార్ట్‌’ పేర్కొంది. రూ.59 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందం విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఓ న్యాయమూర్తిని కూడా నియమించినట్లు తెలిపింది. భారత్‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ఒప్పందం కావడంతో ఈ అంశానికి ఇరు దేశాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.

* ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్‌ల వ‌ద్ద ఖ‌ర్చు చేసిన మొత్తంలో 5 శాతాన్ని తిరిగి రివార్డు పాయింట్లుగా అందిస్తుంది. దీంతోపాటు ఇండియన్ ఆయిల్ XTRAREWARDSTM ప్రోగ్రామ్‌లో కూడా చేరతాడు.

* బీపీసీఎల్ అవుట్‌లెట్‌లో ఖర్చు చేసే ప్రతి రూ. 100 కు బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డ్ ఆక్టేన్‌ 25 రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. మ‌రోవైపు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంకుల్లో ప్రతి రూ. 150 ఖర్చుకు నాలుగు పాయింట్లు ఇస్తుంది.

* హెచ్‌పీసీఎల్ కూడా కార్డుతో పాటు హెచ్‌పీ రీఫ్యుయ‌ల్‌ యాప్ ద్వారా కూడా అవుట్‌లెట్‌లో చెల్లింపు చేసే అవ‌కాశం ఉంది. వాలెట్‌లో డ‌బ్బు లోడ్ చేసుకొని పెట్రోల్ తీసుకుంటే దానిపై వ‌చ్చిన పాయింట్ల‌ను తిరిగి మ‌ళ్లీ పెట్రోల్ కోసం ఉప‌యోగించుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తుంది.

* విండోస్‌ ప్రింట్‌ స్పూలర్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్‌ హెచ్చిరించింది. ప్రింట్‌ స్పూలర్‌ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్‌ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

* అంతరిక్ష రంగంలో అనేక విజయాలను సాధించిన సంస్థ నాసా. పలు అంతుచిక్కని విషయాలను విశదీకరించడంలో నాసా పాత్ర ఎంతగానో ఉంది. బ్లాక్‌ హోల్స్, ఇతర గెలాక్సీలు, ఇతర గ్రహాలను క్షుణంగా పరిశీలించడానికి అత్యంత శక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగిస్తారు. గతంలో నాసా జరిపిన ఈవెంట్‌ హరిజోన్‌లో భాగంగా తొలిసారిగా బ్లాక్‌ హోల్‌ చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం వెనుక ఎంతగానో శ్రమ దాగి ఉంది. ఈవెంట్‌ హరిజోన్‌లో భాగంగా టెలిస్కోప్‌లు గ్రహించిన విషయాలను సూపర్‌ కంప్యూటర్‌తో గణించి చిత్ర రూపంలో తీశారు. కాగా ప్రస్తుతం నాసా కీలక నిర్ణయం తీసుకుంది.