* తూ,,గో,, జిల్లా అమలాపురం: ఉప్పలగుప్తం మండలం కూనవరంలో ఇద్దరు మహిళలపై హత్యాయత్నం.కూనవరం గ్రామంలోని ఓ చర్చి బోదకురాలు సునీతతో పాటు శ్రీలతలను విచక్షణా రహితంగా పొడిచిన గుర్తుతెలియని వ్యక్తి.క్రతగాత్రులను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు.
* గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో నమ్మబలికి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్న యువకుడు పెళ్లి పేరు ఎత్తేసరికి కులం తక్కువ దానివి నిన్ను చేసుకోను అనడంతో ఆ ప్రియురాలు శనివారం ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పర పల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి కిరణ్ వరంగల్ నగర సమీపంలోని కీర్తి నగర్ కాలనీకి చెందిన కుక్కముడి పవిత్ర ను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి ఐదు సంవత్సరాలుగా వెంట తిప్పుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసే కిరణ్ ములుగు మిర్యాలగూడ వరంగల్ హనుమకొండ తదితర ప్రాంతాలలో పవిత్రతో కలసి కాపురం పెట్టాడు. తనను పెళ్లి చేసుకోమని పవిత్ర గట్టిగా నిలదీయడంతో కిరణ్ అసలు రూపం బయటపడింది. మీరు ఎస్సీలు, మేము బీసీలం నిన్ను పెళ్లి చేసుకుంటే మా ఊళ్లో మా కుటుంబ పరువు పోతుందని మా అమ్మ నాన్న అన్న వదిన చనిపోతాం అని అంటున్నారని అన్నాడనీ పవిత్ర తెలిపింది.దీంతో పవిత్ర శనివారం ఉప్పర్ పల్లి లోని ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కిరణ్ పెళ్లి చేసుకోకపోతే తనకు దిక్కెవరని బోరున విలపిస్తూ తెలిపింది.
* రైతు పక్షపాతిగా చెప్పుకునే తెలంగాణ సర్కార్ రైతుల ఇక్కట్లు తొలగించేందుకంటు రూపొందించిన ధరణి వెబ్సైట్ రైతుల పాలిట శాపంగా మారిందనటంలొ ఏమాత్రం సందేహాం లేదు. ఇందుకు సాక్ష్యం ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం హాస్పటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైనం….ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలొ చోటుచేసుకున్న ఘటన. గ్రామానికి చెందిన మోరంపూడి గోపాలరావు సన్నకారు రైతు, ఈయనకు బేతుపల్లి చెరువు ఆయకట్టులొ వారసత్వంగా తనకు వచ్చిన 2ఎకరాల24 కుంటల భూమినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ధరణి వెబ్సైట్లొ తన భూమిని ఎక్కించిన రెవెన్యూ అధికారులు తనకున్న విస్తీర్ణంలొ 1.03కుంటల భూమిని అదే గ్రామానికి చెందిన మోరంపుడి వసంతరావు అనే రైతు పేరిట కొత్తపాస్పుస్తకాలు అందజేశారు. నాటి నుంచి గోపాలరావు తన పాత పాసుపుస్తకాలు చూపుతు విఆర్వో మొదలు కలెక్టర్ వరకు కాల్లరిగేలా తిరిగిన ప్రయేజనం లేకపోయింది. తెలంగాణ సర్కార్ రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా అందిస్తున్న రైతు బంధులొ సైతం అధికారు తప్పిదం కారణంగా సగం మొత్తాన్ని నష్టపోయాడు. ఈ విషయం గ్రామ పెద్దల సమక్షంలొ పలుమార్లు పంచాయితీ నిర్వహించిన ఫలితం లేకపోయిందని దీంతొ మనస్తాపానికి గురై కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భాదిత రైతు భార్య రమాదేవి తెలిపింది. మాకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని రైతు కుమార్తెలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
* తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం చోటు చేసుకున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కిందపడ్డారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రెడీమిక్స్ వాహనం వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను మహారాష్ట్రకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్‌గా గుర్తించారు. వీరు లంగర్‌హౌస్‌లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలో డివైడర్‌ను ఆటో ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.