Food

లాఫింగ్ గ్యాస్‌తో ఒత్తిడి దూరం

లాఫింగ్ గ్యాస్‌తో ఒత్తిడి దూరం

డిప్రెషన్‌ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే దీన్ని తగ్గించేందుకు నిపుణులు సైతం రకరకాల అంశాలను పరిశీలిస్తున్నారు. చికిత్సలో భాగంగా బాధితుల్ని లాఫింగ్‌ గ్యాస్‌(నైట్రస్‌ ఆక్సైడ్‌)కు గంటసేపు గురిచేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తాజా పరిశీలనల్లో తేలిందట. ముఖ్యంగా కరోనా వల్ల జరిగిన నష్టం కావచ్చు, ఇతరత్రా ప్రమాదాలు సంభవించినప్పుడు కావచ్చు… ఆ విషాదం నుంచి కొందరు త్వరగా కోలుకుంటే, మరికొందరు ఎన్నేళ్లయినా దాన్ని మర్చిపోలేక కుంగుబాటుకి గురవుతారు. అలాంటి సందర్భాల్లో యాంటీడిప్రెసెంట్లే శరణ్యం. కానీ వాటివల్ల ఇతరత్రా దుష్ఫలితాలూ ఎక్కువే. అందుకే ఆయా మందుల మాదిరిగానే మెదడుమీద ప్రభావాన్ని కనబరిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ను చికిత్సకు వాడటం మంచిది అంటున్నారు వాషింగ్టన్‌ యూనివర్సిటీ నిపుణులు. పైగా దీన్ని కొద్ది శాతంలో ఇచ్చినా సరిపోతుందనీ దీనివల్ల ఇతరత్రా దుష్ఫలితాలేమీ తలెత్తలేదనీ చెబుతున్నారు.