టైటిల్ ఫేవరెట్ జకోవిచ్ అలవోకగా వింబుల్డన్ క్వార్టర్స్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల నంబర్‌వన్ బార్టీ, రెండో సీడ్ సబలెంక తుది ఎనిమిదిలో చోటు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు తొలిసారి వింబుల్డన్ క్వార్టర్స్‌లో చోటు సంపాదించారు. రుబ్లెవ్, క్రెజికోవా, స్వైటెక్‌ల కథ ముగిసింది. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సూపర్ ఫామ్‌ను కొనసాగించిన అతడు.. నాలుగో రౌండ్లో 6-2, 6-4, 6-2తో గారిన్ (చిలీ)ను చిత్తు చేశాడు. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జకోవిచ్.. మ్యాచ్‌లో 9 ఏస్‌లు, 29 విన్నర్లు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్ చేరడం జకోవిచ్‌కు ఇది 50వ సారి. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) తొలిసారి వింబుల్డన్ ప్రిక్వార్టర్స్ దాటారు. నాలుగో రౌండ్లో బెరెటిని 6-4, 6-3, 6-1తో ఇవష్కా (బెలారస్)ను చిత్తు చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన అతడు.. 37 విన్నర్లు కొట్టాడు. షపొవలోవ్ 6-1, 6-3, 7-5తో బటిస్టా అగట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. పదునైన సర్వీసులు చేసిన షపొవలోవ్ మ్యాచ్‌లో 15 ఏస్‌లు కొట్టాడు. అయిదు సెట్ల ప్రిక్వార్టర్స్ పోరాటాల్లో కచనోవ్ 3-6, 6-4, 6-3, 5-7, 10-8తో కొర్డా (అమెరికా)పై నెగ్గగా.. పుక్సోవిచ్ 6-3, 4-6, 4-6, 6-0, 6-3తో అయిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు.
క్వార్టర్స్‌కు జకో
Related tags :