* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్ రంగ సూచీలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. చివరకు సెన్సెక్స్ 395 పాయింట్ల లాభంతో 52,880 వద్ద.. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 15,834 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద నిలిచింది.
* ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాను స్థాపించి, పెంచి పెద్ద చేసిన అమెజాన్‌కు నేటి నుంచి గుడ్‌బై చెప్పనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చిన అమెజాన్ కంపెనీ సీఈవో పదవికి జులై 5న ఆయన పదవి విరమణ చేశారు. అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ సేవల వైపు మొగ్గు చూపడంతో అమెజాన్ 2020లో గణనీయంగా లాభాలను గడించింది. దీంతో అమెజాన్ వ్యవస్తాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగింది.సుమారు 2020 సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా జెఫ్ బెజోస్ 1994 జూలై 5 న తొలిసారిగా అమెజాన్‌తో ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్దమైతున్న విషయం తెలిసిందే. జెఫ్ బెజోస్ సంపద విషయానికొస్తే.. బెజోస్ మొత్తం బ్రిటిష్ రాజకుటుంబ సంపద కంటే రెండింతలు ఎక్కువ సంపదతో పదవి విరమణ తీసుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం సంపద సుమారు 88 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 203 బిలియన్ల డాలర్లు. 2018 నుంచి 2020 వరకు బిల్ గేట్స్ నికర ఆస్తి విలువ రూ .6.12 లక్షల కోట్ల నుంచి రూ .8.58 లక్షల కోట్లకు ఏగబాకింది. ఒక నివేదిక ప్రకారం, అతని సంపద 73 శాతం పెరిగింది. బెజోస్ తన పెన్షన్‌ను కవర్ చేయడానికి సుమారు 197 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నాడు.
* డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్ట్‌పెయిడ్ మిని పేరుతో కొత్త సేవలను లాంచ్ చేసింది. బై నౌ.. పే లేటర్ సర్వీసులకు ఇవి ఎక్స్‌టెన్షన్ అని చెప్పొచ్చు. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో పేటిఎమ్ ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుత కరోనా కాలంలో ఎటువంటి వడ్డీ లేకుండా రూ.250 నుంచి రూ.1,000 వరకు స్వల్ప రుణాలను తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను ముప్పై రోజుల్లోపు తిరిగి చెల్లించాలి.
* దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ కామర్స్ వ్యాపార సంస్థలకు దీటుగా ప్రత్యేకంగా ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో సరికొత్త సేల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ సేల్ జూలై 4న నుంచి జూలై 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ సేల్లో భాగంగా టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఓయో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఎస్‌బీఐ మీకు కల్పిస్తోంది. టాటా క్లిక్‌లో అయితే రూ.300 వరకు బెనిఫిట్ పొందవచ్చు అని తెలిపింది. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. “తన వినియోగదారులకు అంతిమ షాపింగ్ ఆనందాన్ని అందించడానికి యోనో వేదాంతు, అపోలో 24ఐ7, ఈస్ మైట్రిప్, ఓయో వంటి అగ్ర శ్రేణి వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉంది” అని ఎస్‌బీఐ తెలిపింది.