ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం మరో నాయికనూ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడా పాత్ర కోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నాయిక వాణీ కపూర్‌ను ఖరారు చేశారని సమాచారం. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఓ కీలక పాత్రలో ఆమె కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ప్రభాస్ సరసన వాణీకపూర్
Related tags :