* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు 30వ రోజు ఐదుగురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ హిదాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్, వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐదుగురిని పులివెందుల అతిథి గృహంలో విచారించిన అధికారులు.. ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు.కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని మరోసారి సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు.గత 28 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు.ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.
* జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్.పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరిన సబితా ఇంద్రారెడ్డి.సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ.కౌంటరు దాఖలు కోసం విచారణను ఈనెల 13కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్.పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శామ్యూల్ ను తొలగించవద్దని కోరిన సీబీఐ.పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరుకు సమయం కోరిన సీబీఐ.పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ.పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ పై విచారణ ఈనెల 13కి వాయిదా.
* రంగారెడ్డి జిల్లా…-శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ సమీపంలో భారీ ఎత్తున గంజాయి పట్టివేత.-పోలీసులను చూసి 10 గంజాయి బ్యాగ్స్ వదిలి వెళ్లిన మాఫియా.-దాని విలువ కోట్లలో ఉంటుందని అంచనా.
* శ్రీశైలంలో డ్రోన్ల కలకలంపై వీడని మిస్టరీ -డ్రోన్ ఆచూకీ కోసం శ్రీశైలంలో ప్రతి ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు -గాలింపు కోసం పోలీస్ డ్రోన్ ను తెప్పించిన అధికారులు.
* జీ హెచ్ ఎంసీ భూసేకరణలో భారీ స్కామ్.. యూసుఫ్ గూడ..రహమత్ నగర్ రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ.. అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు.. తమకు రావాల్సిన నష్ట పరిహారం చిన్న శ్రీశైలం యాదవ్ కి ఇచ్చారు అంటూ త్యాగరాజన్ అనే వ్యక్తి ఫిర్యాదు.రూ. 4.24 కోట్ల నష్టపరిహారం వ్యవహారంలో శ్రీశైలం యాదవ్ కు షోకాజ్ నోటీసులు..యూసుఫ్ గూడ చెక్ పోస్టు నుంచి రహమత నగర్ చౌరస్తా వరకు 2012లో రహదారి విస్తరణకు అనుమతులు.2017లో రూ. 4,24,60,317లకు సంబంధించి మూడు చెక్కులు తీసుకున్న శ్రీశైలం యాదవ్, అతని భార్య కస్తూరి.ఈ స్థలాన్ని తాము యూ ఎల్ సీ కింద క్రమబద్ధీకరణ చేయాలని దరఖాస్తు చేసుకున్నామని త్యాగరాజన్ అనే వ్యక్తి ఫిర్యాదులు..యూఎల్సి లో ఉన్న దాదాపు దాదాపు 518 గజాల స్థలానికి తమకు రావాల్సిన నష్ట పరిహారం చిన్న శ్రీశైలం కుటుంబం తీసుకున్నారని ఫిర్యాదు.
* 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు..పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్‌పోర్ట్‌కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి.ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు.సముద్రంలో విమానం కూలిపోయిన ప్రాంతానికి నౌకలు వెళ్తున్నాయని అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.ప్రయాణీకులలో గ్రామ మేయర్ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నారని చెబుతున్నారు.
* హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ సోదాలు.వైసీపీ ఎంపీ,రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు.గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు.రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు.15 బృందాలతో వివిద ప్రాంతల్లో ఐటీ అధికారులు సోదాలు.
* అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 293.81 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.