బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌పై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కు చెందిన ఏడుగురిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. అరుణ్ గుప్తా అనే ఓ వ్యాపారి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రూ.3 కోట్ల ఖర్చుతో బీయింగ్ హ్యూమన్ వస్త్రాల షోరూం అరుణ్ గుప్తా ప్రారంభించారు. అయితే, ఢిల్లీ నుంచి నుంచి తనకు సదరు సంస్థ నుంచి అందాల్సిన వస్త్రాలు రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బీయింగ్ హ్యూమన్ సంస్థ వెబ్‌సైట్ కూడా పని చేయడం లేదని తెలిపారు. మనీమాజ్రాలో షాపు తెరవాలని బీయింగ్ హ్యూమన్ సంస్థ ఉద్యోగులే తనను కోరారని అరుణ్ గుప్తా చెప్పారు. దాంతో షోరూమ్‌ను తెరిచానని.. షోరూమ్ నిర్మాణం, అలంకరణకు అన్నీ కలిపి రూ.3కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. తనను బిగ్‌బాస్ సెట్లోకి సైతం పిలిచి, సల్మాన్‌ఖాన్ ఆనందం వ్యక్తం చేసి.. షోరూమ్ ప్రారంభించేందుకు తాను వస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత రాలేదని అరుణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఈ నెల 13లోగా సమాధానం ఇవ్వాలని సల్మాన్‌ను ఆదేశించినట్లు ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
సల్మాన్‌పై ఛీటింగ్ కేసు
Related tags :