భారత్‌లో అమాంతం విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వైరస్ ప్రధాన రకంగా మారిందని ఆ దేశ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ చిన్నారులపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం కంటే అధికంగా డెల్టా రకం కేసులే వెలుగు చూస్తున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. మిస్సోరీ, కేన్సస్, అయోవా రాష్ట్రాల్లో 80 శాతం కేసులు డెల్టా వేరియంటే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉటా, కొలరాడో రాష్ట్రాల్లో పాజిటివ్‌గా తేలిన బాధితుల్లో 74.3 శాతం మందికి డెల్టా రకం సోకినట్లు సీడీసీ పేర్కొంది. టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్‌సన్ వివరించారు. కరోనా డెల్టా వేరియంట్‌కు సంక్రమణ తీవ్రత అధికమని.. దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు.
అమెరికాకు పాకిన డెల్టా వేరియంట్. చిన్నారులపై పంజా.
Related tags :