వెంకటేష్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం నారప్ప. అసురన్ రీమేక్ గా వస్తున్న ఈ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. నిర్మాత సురేశ్ బాబు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఎఫెక్ట్‌తో థియేటర్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సురేశ్‌బాబు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇపుడు సురేశ్ బాబు ఓటీటీలో నారప్ప ను విడుదల చేయాలన్న నిర్ణయాన్నిమార్చుకున్నాడన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. థియేటర్లు పున: ప్రారంభం కావడంతో సినిమాను థియేటర్ లోనే విడుదల చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్నారట సురేశ్‌బాబు. అంతేకాదు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం కూడా సురేశ్ బాబు నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాకు సమర్పకుడిగా ఉన్న కలైపులి ఎస్ థాను థియేటర్ విడుదలకు సిద్దంగా లేనట్టు టాక్ నడుస్తోంది. ఒకవేళ థియేటర్ లో విడుదల వల్ల ఏమైనా నష్టాలు వస్తే వెంకటేశ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి..ఎస్ థాను ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి నారప్ప సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తాడనేది మాత్రం అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
థియేటర్లలో నారప్ప. నష్టం వస్తే రెమ్యూనరేషన్ వెనక్కి.
Related tags :