NRI-NRT

భారత విమానాలపై ఒమన్ నిషేధం

భారత విమానాలపై ఒమన్ నిషేధం

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఒమన్‌ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌తో సహా 24 దేశాల నుంచి ప్రయాణికుల విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు 24 దేశాల నుంచి ప్రయాణ విమానాలను రద్దు చేసినట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల విమానాలను ఒమన్‌ నిలిపివేసిన జాబితాలో బ్రిటన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌ వంటి దేశాలు ఉన్నాయి. కాగా, బుధవారం ఒమన్‌లో కొత్తగా 1,675 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,235కు చేరింది. ఒమన్‌లో ఇప్పటి వరకు 3,356 మంది కరోనా వల్ల మరణించారు.