Politics

కేసీఆర్‌తో రమణ ములాఖాత్

కేసీఆర్‌తో రమణ ములాఖాత్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌ ర‌మ‌ణ భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఎల్ ర‌మ‌ణ చేరుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం ద‌యాక‌ర్ రావుతో ర‌మ‌ణ ప‌లు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంత‌రం రమ‌ణ‌.. టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై స్ప‌ష్ట‌త రానుంది.