Politics

షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో విజయమ్మ ఉద్వేగం-తాజావార్తలు

షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో విజయమ్మ ఉద్వేగం-తాజావార్తలు

* వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘శత్రువులైనా, ప్రత్యర్థులైనా వైఎస్‌ఆర్‌ను అభిమానించారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలి. ఆయన మరణంలేని నాయకుడు. తెలంగాణలో వైఎస్‌ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. వైఎస్‌ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలుగువారి గుండె చప్పుడు వైఎస్‌. షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నమస్సులు. జగన్‌, షర్మిల వైఎస్‌ ఆత్మీయత, హావభావాలు పుణికిపుచ్చుకున్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలు, పార్టీలకు ప్రతినిధులు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయి. తండ్రి కల సాకారం చేసేందుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి ఆశయ సాధన కోసం మీ ముందుకు వస్తోంది. మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకోండి’’ అని విజయమ్మ అన్నారు.

* రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు.రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 4,019 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో 24 గంటల్లో 83,885 మందికి కరోనా పరీక్షలు.కరోనాతో చిత్తూరులో 4, తూ.గో.లో 4, కృష్ణాలో ముగ్గురు మృతి.అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప.గో.జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి.తూ.గో. జిల్లాలో 664, ప.గో. జిల్లాలో 431 కరోనా కేసులు.ప్రకాశం జిల్లాలో 375, చిత్తూరు జిల్లాలో 337 కరోనా కేసులు.

* కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో బిర్యానీ మీటింగ్‌లు పెట్టిన జగన్‌.. నీటి వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు?ప్రభుత్వ అవినీతి, అసమర్థత, నిస్సహాయతలను ప్రశ్నిస్తే చంపేస్తారా ?మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన వారిని రాష్ట్రంలో తిరగనివ్వం.. అంటూ బెదిరింపులకు దిగడం హేయమైన చర్య.మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

* న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘు రామ‌ కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌ సాయిరెడ్డి, లోక్‌స‌భ నాయ‌కుడు మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ కోరారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు విన‌తిప‌త్రం అంద‌జేశారు.

* దిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. జనరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగ వెలువడినట్లు అధికారులు పేర్కొన్నారు.

* జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై ఈనెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజుతోపాటు సీబీఐని కోర్టు ఆదేశించింది.

* భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్‌ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు మరోసారి విచారణ జరిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. జులై 6న భారత్‌కు చెందిన వ్యక్తిని తాత్కాలికంగా చీఫ్‌ కాంప్లియెన్స్ అధికారిగా నియమించామని ట్విటర్‌ తెలిపింది. జులై 11న తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిని, ఆ తర్వాత నోడల్‌ కాంటాక్ట్‌ అధికారిని నియమించనున్నట్లు చెప్పింది. ఈ హోదాల్లో పూర్తిస్థాయి అధికారులను 8 వారాల్లోగా నియమిస్తామని పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. ‘‘కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. జలాల కేటాయింపులపై గతంలో ఒప్పందాలు జరిగాయి. శ్రీశైలంలో 881 అడుగులు నీరు చేరితే తప్ప నీళ్లు కిందకు రానప్పుడు.. 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముంది?రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి’’అని సీఎం జగన్‌ వెల్లడించారు.

* తెలంగాణలో తెరాసను ఢీకొట్టే వాళ్లెవరూ లేరని, కేసీఆర్‌ను తిడితే ఓట్లు వస్తాయనుకోవడం వెర్రితనం అవుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కేసీఆర్‌ మాదిరిగా ప్రజలను ప్రేమించడం నేర్చుకుంటే కాస్తో.. కూస్తో ఓట్లు పడతాయని పేర్కొన్నారు. త్వరలోనే దేశానికే పాఠాలు చెప్పే దిశగా తెలంగాణ తయారవుతుందని మంత్రి వివరించారు. మొన్నటి దాకా సోనియాను తెలంగాణ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని ఎద్దేవా చేశారు.

* టీపీసీసీ అధ్యక్షుడిగా తనను కాదని రేవంత్‌రెడ్డిని నియమించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. తనకు పీసీసీ పదవి రాలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానన్నారు. సీనియర్‌ నేతగా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. ‘‘ఏ పార్టీలో చేరను. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతాం. గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం’’ అని వెంకట్‌రెడ్డి తెలిపారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని ప్రజారోగ్య సంచాల‌కులు (డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు తెలిపారు. కొవిడ్‌ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడో వేవ్‌ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు లేవన్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని డీహెచ్‌ తెలిపారు. ఇప్పటి వరకు 1.20కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు.

* భారత్‌లో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించడానికి ట్విటర్ ఎనిమిది వారాల సమయాన్ని కోరింది. ఈ మేరకు గురువారం దిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధన అమలు విషయంలో ట్విటర్ ఇటీవల కోర్టు ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి జులై 6న భారత్‌కు చెందిన వ్యక్తిని తాత్కాలిక అధికారిగా నియమించినట్లు సంస్థ కోర్టుకు వెల్లడించింది.

* బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. దేశంలో నివసించే, పనిచేసే వారు ఇక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భాజపా ఆర్గనైజేషన్‌ సెక్రటరీతో ఆయన గురువారం భేటీ అయ్యారు.

* కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 40లక్షలమంది ప్రాణాలను బలితీసుకుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక భయంకరమైన మైలురాయి అంటూ అభివర్ణించారు. అలాగే అంతర్జాతీయ టీకా ప్రణాళికను పట్టాలెక్కించాల్సిన అవసరాన్ని ఓ ప్రకటనలో గుర్తుచేశారు.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు నేల చూపులు చూశాయి. బుధవారం సెన్సెక్స్‌ 53 వేల పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకిన ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. సెన్సెక్స్‌ మళ్లీ 52,500 స్థాయికి చేరుకోగా.. నిఫ్టీ సైతం 15,750 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.71గా ఉంది.

* గాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాలుడికి వైద్యులు ‘బిగిల్‌’ సినిమా చూపించి చికిత్స చేశారు. ఈ ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన శశి అనే పదేళ్ల కుర్రాడు తన మేనమామతో కలిసి ద్విచక్ర వాహనంపై సరదాగా బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు శశి బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్స నిమిత్తం రాయ్‌పేటలోని వైద్యశాలకు తీసుకువచ్చారు.

* టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు అతడు చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ మొదలుకొని అనేకమంది అతడికి శుభకాంక్షలు తెలియజేశారు.