NRI-NRT

SpellBee2021: తుమ్మల చైత్ర ఓటమి

SpellBee2021: తుమ్మల చైత్ర ఓటమి.

అమెరికాలో నేషనల్ స్పెల్ బీ 2021 పోటీలో రెండు రికార్డులు నెలకొన్నాయి. ఒకటి భారతీయ అమెరికన్ బాలల ప్రతిభకు బ్రేకులు పడగా, రెండోది 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పోటీల్లో 2021లో తొలిసారిగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ బాలిక గెలుపొందింది. 12 ఏళ్ల తుమ్మల చైత్రకు, 14 ఏళ్ల జైలా అవాంత్ గార్డేకు మధ్య జరిగిన తుదిసమరంలో Neroli Oil స్పెల్లింగ్ తప్పు చెప్పిన చైత్ర జైలాకు Murraya స్పెల్లింగ్ చెప్పే అవకాశాన్ని కల్పించి తద్వారా ఓటమి చవిచూసింది.