* మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర బైఠాయింపు.మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు.ఆక్రమణల పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపుల తొలగిస్తున్నారంటూ ఆరోపణలు.బాధితుల పక్షాన నిలిచిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.ఘటనాస్థలిలో బైఠాయించిన కొల్లు రవీంద్ర.భారీగా మోహరించిన పోలీసులు.
* దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అక్కడి కాలుష్య నియంత్రణ కమిటీ ఝలక్ ఇచ్చింది. ఇకపై వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శబ్దకాలుష్యానికి విధించే పెనాల్టీ మొత్తాల్ని సవరించింది.
* చందానగర్ పిఎస్ పరిధిలో యువకుని పై హత్యాయత్నం…శేరీలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద గల లింకు రోడ్డులో ఈ ఘటన జరిగింది….పాపిరెడ్డి కాలనీ లో నివాసం ఉండే విజయ్ కుమార్ ను బీరు బాటిళ్ళతో కిరాతకంగా గొంతు కోసిన దుండగులు.నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన లో ముగ్గురు ఆటో లో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని,యువకుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఘటనా స్థలానికి చేరుకోగా దుండగులు పారిపోయారని చందనగర్ సిఐ కాస్ట్రో రెడ్డి తెలిపారు.
* మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం బొజ్యా తండ గ్రామపంచాయతీకి చెందిన ఇద్దరు రైతులు రోజు మాదిరిగా శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన ఆ ఇద్దరు బోర్ స్టాటర్ ఫీజు వైరు పెడుతున్న సమయంలో.. బోరుకు జే వైరు తాకి ఉండడంతో షాక్ తగిలిన ఆ ఇద్దరు రైతులు మాలోతు యాకు, భూక్య సుధాకర్ అక్కడికక్కడే మరణించారు. దీనితో కుటుంబాలతో పాటు ఆ గ్రామంలోనే విషాదం చోటుచేసుకుంది.