Health

కరోనా సహకారం కోసం సెక్స్ వర్కర్ల విజ్ఞప్తి-TNI బులెటిన్

కరోనా సహకారం కోసం సెక్స్ వర్కర్ల విజ్ఞప్తి-TNI బులెటిన్

* కరోనా మహమ్మారి నేపద్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర, కేంద్ర పబుత్వలకు జారీచేసిన ఆదేశాలను సూచనల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కనుగొని వాటి అమలు తీరు తెన్నులను పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రాగం ను ఏర్పాటు చేయాలనీ కోరుతూ సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణ బాధితుల రాష్ట్ర సమాక్య “విముక్తి” జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ కు వినతి పత్రం అందచేసినట్లు విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా మీడియాకు తెలియజేసారు.

* సరికొత్త మ్యుటేషన్లతో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే డెల్టా ప్లస్‌ కలవరం పుట్టిస్తుంటే.. కొత్తగా కపా రకం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవ్‌రియా, గోరఖ్‌పూర్‌లో ఈ కొత్త స్ట్రెయిన్‌కు చెందిన రెండు కేసుల్ని గుర్తించారు. దీని బారినపడిన 66 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

* క‌రోనా క‌ట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 19 వ‌ర‌కూ పొడిగించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు కొంత‌మేర స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. షాపులు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ తెరిచిఉంచేందుకు అనుమ‌తించింది. రెస్టారెంట్ల‌ను యాభై శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో ఓపెన్ చేసే వెసులుబాటు క‌ల్పించింది. పుదుచ్చేరికి బ‌స్ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించింది.

* AP లో గడచిన 24 గం,, లలో 2925 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.