భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతిచ్చింది. అమెరికా వెళ్లే ముందు వచ్చిన తర్వాత సీబీఐకి వివరాలు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీలో సాంకేతికతపై చర్చించేందుకు యూఎస్ వెళ్లనున్నట్లు సుజనా చౌదరి కోర్టుకు తెలిపారు. సీబీఐ లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున సుజనా హైకోర్టు అనుమతి కోరారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల గురించి తెలుసుకునేందుకు అమెరికా వస్తున్న సుజనా
Related tags :