NRI-NRT

పక్షులు రెట్ట వేస్తున్నాయని CIA ఆ పని చేసిందని నమ్ముతున్నారు

పక్షులు రెట్ట వేస్తున్నాయని CIA ఆ పని చేసిందని నమ్ముతున్నారు

అమెరికాలో 1950కాలంలో అప్పటి సీఐఏ(సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ) దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని భావించిందట. భద్రతా సిబ్బంది, కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటి పరిధిలో మాత్రమే రక్షణ కల్పించగలం. అంతకు మించి నిఘా పెట్టాలంటే రోబో పక్షులను తయారు చేయాలని సీఐఏ భావించిందట. ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.. ప్రకృతిలో మమేకమైన పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబో పక్షులను వదలాలని నిర్ణయించిందట. ఇందుకోసం భారీ ఆపరేషన్‌ చేపట్టిందని ఈ సిద్ధాంతం చెబుతోంది. పక్షులను చంపాల్సిన అవసరమేముంది అని అంటే.. అందుకు ఒక కారణముందట. అధికారుల ఖరీదైన కార్లపై పక్షులు రెట్టలు వేయడంతో వాటిని అంతం చేయాలని సీఐఏ సంకల్పించిందని చెబుతుంటారు. 1959 నుంచి 2001 వరకు అమెరికా వ్యాప్తంగా దాదాపు 12బిలియన్‌ పక్షుల్ని చంపి.. వాటి స్థానంలో రోబో పక్షుల్ని తీసుకొచ్చారని ఈ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోబో పక్షులు పవర్‌లైన్స్‌పై కూర్చొని వాటంతట అవే ఛార్జింగ్‌ చేసుకుంటాయని చెబుతున్నారు. బర్డ్స్‌ ఆర్‌ నాట్‌ రియల్‌ అనే వెబ్‌సైట్‌లో ఈ సిద్ధాంతానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చారు.