* విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరిన విజయసాయిరెడ్డి.దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరిన విజయసాయి.అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లనున్నట్లు తెలిపిన విజయసాయి.విదేశాలకు వెళ్లేందుకు 2 వారాల అనుమతివ్వాలని కోరిన విజయసాయి.విజయసాయి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు గడువు కోరిన సీబీఐ.విజయసాయి పిటిషన్‌పై విచారణ ఈనెల 16కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.
* మిర్యాలగూడలో అర్ధరాత్రి దోపిడి దొంగల బీభత్సం…సాగర్ రోడ్డు పై రెండు షాపుల్లో చోరీ….షాప్ షటర్ లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన దుండగులు…బస్టాండ్ వద్ద ఆర్ఆర్ వైన్స్, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా శ్రీనివాస ఆటో మొబైల్స్ లో చోరికి పాల్పడిన దొంగలు…సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
* విజయనగరం రురల్ పరిధిలో భారీగా పట్టుబడ్డ గంజాయి…- వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీ చేపట్టిన పోలీసులు – అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు – వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయి ని గుర్తించిన పోలీసులు – దొరికిన గంజాయి విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా
* గుంటూరు జిల్లాలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దాచేపల్లి మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రామాపురం గ్రామ శివారులో నుంచి అక్రమంగా తరలిస్తున్న 2వేల మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్దనున్న మూడు కార్లను సీజ్ చేశారు.