Movies

లక్ష జరిమానా కట్టమని ఆర్డరు

లక్ష జరిమానా కట్టమని ఆర్డరు

తమిళ స్టార్ హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చెల్లించాల్సిన పన్ను కట్టక పోవడంతో  లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు..రీల్ హీరోకు పన్నులు కట్టడానికి మనసు రావడం లేదని… ట్యాక్స్ కట్టేందుకు వెనుకాముందు ఆడుతున్నారని విమర్శించింది.

2012లో ఇంగ్లండ్ నుంచి విజయ్ ఖరీదైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నాడు. అయితే.. కారు దిగుమతికి సంబంధించి ఇంత వరకు ఆయన భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదు. అంతేకాదు.. దిగుమతి పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో 2012లో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఇవాళ(మంగళవారం) దాన్ని కొట్టేసింది. పన్ను చెల్లించాల్సిందేనని విజయ్ ని ఆదేశించింది. పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు యత్నించినందుకు రూ. లక్ష జరిమానా విధించింది.