సుప్రభాత వేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకునేవారికి ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై తాజ్‌ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించనుంది. ఈ మేరకు ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ ఛాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటిదాకా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాజ్‌ను దర్శించేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతో బంగారు వర్ణంలో మెరిసే తాజ్ సోయగాన్ని వీక్షించే అవకాశాన్ని పర్యాటకులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో తాజ్ అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉదయం 6 గంటల నుండి తాజ్ చూడవచ్చు
Related tags :