DailyDose

వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ దీక్ష-నేరవార్తలు

వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ దీక్ష-నేరవార్తలు

* పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

* మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు.

* కంచికచర్ల మండలంలో దొనబండ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వ్యాన్ ను తనిఖీ చేయగా 30 నుండి 35 లక్షల రూపాయల నగదు గుర్తింపు…

* ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు.ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది.ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్.సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది.

* వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ​ దీక్ష చేపట్టారు.వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా వివిధ గాంధేయవాద సంస్థలు ఆయనకు మద్దతుగా దీక్ష చేపట్టాయి.తిరువనంతపురంలోని గాంధీభవన్​లో ఈ నిరసనలను ప్రారంభించాయి.గవర్నర్​.. సాయంత్రం 4 గంటలకు ఈ నిరాహార దీక్షను విరమిస్తారు.అనంతరం గాంధీభవన్​లో నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొంటారు.ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.వరకట్న వేధింపుల కారణంగా ఇటీవల వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి.పలువురు మహిళల వరకట్న వేధింపులు తాలలేక మృతి చెందటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గవర్నర్​.వరకట్న సంప్రదాయాన్ని రూపుమాపేందుకు తాను స్వచ్ఛందంగా పనిచేసేందుకు సిద్ధమని గవర్నర్​ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం దీక్ష చేపట్టారు.