* ఈరోజు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం..తాజాగా 3360 మీటర్ల కొత్త రన్ వే పనులు విస్తరణ పూర్తి…గతంలో 2286 మీటర్ల రన్ వే ఉండగా అదనంగా 1074 మీటర్ల విస్తరణ..ఇప్పటివరకు కేటగిరీ -సి రాకపోకలు…రన్ వే అందుబాటులో రావటంతో పెద్ద బోయింగ్ విమానాలు 777, 747 , ఎయిర్ బస్ – 30 సర్వీసులు రాకపోకలు…దుబాయ్ , సింగపూర్ సర్వీసులు ప్రారంభం…ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం కొత్త రన్ వే పై ల్యాండింగ్..ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు.
* జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు 860 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం – మోమిడి పరిధిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు.
* ఒక్కో అడుగు ముందుకేస్తున్న టి.ఎస్.ఆర్టీసీ కార్గో.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖకు కార్గో సర్వీసుల సేవలు ప్రారంభం.సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టి.ఎస్ . ఆర్టీసీ కార్గో పలు చర్యలు తీసుకుంటోంది .గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె.చంద్రశేఖర రావు గారి సలహా మేరకు , గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచనలతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో , పార్శిల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే .ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలతో కార్గో విభాగం కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది .దీంతో కార్గో , పార్శిల్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ అయ్యాయి .పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న సేవలు మరింత త్వరితగతిన అందే విధంగా టి.ఎస్.ఆర్టీసీ తగు కార్యాచరణను అమలుపరుస్తోంది .
* ప్రస్తుత సంవత్సరం (2021)లో దేశీయంగా ఐటీ కోసం వ్యయాలు 92.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7 లక్షల కోట్లు)గా నమోదయ్యే అవకాశం ఉందని గార్ట్‌నర్ నివేదిక పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో, 2020లో దేశీయంగా ఐటీ వ్యయాలు 1.5 శాతం తగ్గి 85.865 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.44 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఐటీ వ్యయాలు 8 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రపంచ సగటైన 8.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై 4.2 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఎంటర్‌ప్రైజ్ సాప్ట్‌వేర్ విభాగంలో వ్యయాల వృద్ధి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ విభాగానికి సంబంధించి వెచ్చించే వ్యయాలు 2021లో 16.9 శాతం పెరిగి 9.218 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని గార్ట్‌నర్ తెలిపింది. 2020లో 5.9 శాతం క్షీణించినా, ఈ ఏడాది డివైజెస్‌పై వ్యయాలు 7.6 శాతం పెరిగి 38.747 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. ఐటీ సేవల కోసం వెచ్చించే వ్యయాలు 10.7 శాతం వృద్ధితో 18.103 కోట్ల డాలర్లకు, డేటా సెంటర్ సిస్టమ్స్‌లపై వ్యయాలు 3.4 శాతం అధికమై 2.706 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కమ్యూనికేషన్స్ సేవలపై వ్యయాలు 4.3 శాతం తగ్గి 23.979 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ‘కొవిడ్-19, లాక్‌డౌన్ పరిణామాల వల్ల 2021 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో వ్యాపారాలు స్తబ్దుగా సాగాయి. అయితే చాలా రంగాల్లో ప్రస్తుతం గిరాకీ వేగంగా పుంజుకుంటోంద’ని గార్ట్‌నర్ పేర్కొంది.