Movies

అతనికి భార్యగా రాధికా

సైఫ్ భార్యగా రాధికా

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కనున్న రీమేక్‌ చిత్రం ‘విక్రమ్‌ వేద’. హృతిక్‌రోషన్, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇందులోని మరో ముఖ్యమైన పాత్ర కోసం కథానాయిక రాధికా ఆప్టేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులోని న్యాయవాది పాత్ర చాలా కీలకమైంది. పోలీస్‌ అధికారి (సైఫ్‌)కి భార్యగా, గ్యాంగ్‌స్టర్‌ (హృతిక్‌)కు న్యాయవాదిగా వ్యవహరించే ఈ పాత్రకు రాధిక అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. తమిళ మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రిలే హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి 2022 సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.