DailyDose

భద్రచాలంలో ₹3కోట్ల గంజాయి స్వాధీనం-నేరవార్తలు

భద్రచాలంలో ₹3కోట్ల గంజాయి స్వాధీనం-నేరవార్తలు

* భ‌ద్రాచ‌లం చెక్‌పోస్టు వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు.త‌నిఖీల్లో భాగంగా లారీలో త‌ర‌లిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని సీజ్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి హైద‌రాబాద్‌కు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

* నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గండువారి పల్లి గ్రామంలో వంట చేసుకుంటూ ఉండగా గ్యాస్ లీకై కాలిపోయిన ఇల్లు మరియు ఇంట్లోని సామాగ్రి..

* శ్రీనివాస మంగాపురం వద్ద 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం.రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, రెండు బృందాల టాస్క్ ఫోర్స్ బలగాలు.తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున తొమ్మిది ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో డాగ్ స్క్వాడ్ సహాయం తో రెండు టాస్క్ ఫోర్స్ టీమ్ లు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నాయి.అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాలు మేరకు డిఎస్పీ .మురళీధర్ సూచనలతో ఆర్ ఐ భాస్కర్ ఆధీనంలో ని ఆర్ ఎస్ ఐ సురేష్ బృందం సోమవారం సాయంత్రం నుంచి శ్రీవారిమెట్టు , శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

* ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డారు.నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఐటీబీటీ 45వ బెటాలియన్ జవాన్ల బృందం వెళ్ళి పర్యటన మార్గంలో శోదిస్తున్నారు.ఆ క్రమంలో డోంగేర్ గుట్టల వైపు వెళ్ళే మలుపు వద్ద జవాన్లపై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు.జవాన్లు తేరుకొని ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు.వివరాలు తెలియాల్సి ఉంది.మావోయిస్టుల కాల్పుల్లో ఐటీబీపీ జవాన్ ఒకరు మృతి చెందినట్లు ఏఎస్‌పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు.గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.