రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. జె.శివకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మీనా, ఖుష్బు, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్ కోసం కోల్‌కతాలో ఏర్పాట్లు చేసినా అనుకోని కారణాల వల్ల చిత్రీకరణ చేయలేదు. దీంతో మంగళవారం చెన్నైలోని ఓ స్టూడియోలో ‘అన్నాత్తే’ చిత్రీకరణను మొదలుపెట్టారు. రజనీకాంత్‌పై కొన్ని సీన్స్‌ను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ సన్నివేశాలు పూర్తయ్యాకా తిరిగి కోల్‌కతా షెడ్యూల్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఓ పదిరోజుల పాటు చిత్రీకరణ చేయనున్నారు. ఆ షెడ్యూల్‌లో రజనీతో పాటు ఇతర తారాగణం పాల్గొననుంది. ఈ చిత్రం ఈ ఏడాది నవంబరు 4న రానుంది.
మద్రాసులో అన్నాత్తే షూటింగ్
Related tags :