రోదసీ యాత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పర్యటిస్తున్నారు. బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో స్పేస్ టూర్కు వెళ్లారు. ఆయనతో పాటు బెజోస్ సోదరుడు మార్క్, వాలీ ఫంక్, అలివర్ డేమన్ అనే 18 ఏళ్ల యువకుడు ఉన్నారు. న్యూ షెపర్డ్ ఇంజినీర్లలో భారతీయ మహిళ ఉన్నారు. అనుకున్న ప్రకారం 100 కిలోమీటర్ల పై ఎత్తుకు వెళ్లి భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా చేపట్టిన ఈ యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే.
అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తిచేసి తిరిగొచ్చిన బెజోస్
Related tags :